డబ్బింగ్‌ కి రెడీ అవుతున్న యంగ్‌ టైగర్‌!

Thursday, September 19, 2024

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘దేవర 1’ విడుదలకు ఇక నెల రోజుల సమయం ఉంది. అందుకే, టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో పడింది.

ఇందులో భాగంగా ఎన్టీఆర్ వచ్చే వారం నుంచి డబ్బింగ్ పై ఫోకస్‌ పెట్టనున్నాడు.తన పాత్రకు ఇతర భాషల్లో కూడా ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పబోతున్నారు. డబ్బింగ్ అనంతరం సినిమా ప్రమోషన్స్ లో బిజీ అవుతాడట. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ‘దేవర పార్ట్ 1’ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles