ఆ సన్నివేశాల గురించి ముద్దుగుమ్మ ఎమోషనల్‌ పోస్ట్‌!

Saturday, November 23, 2024

రుహానీ శర్మ…తెలుగులో ఆగ్రా అనే సినిమాలో నటించిన కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతున్న సంగతి తెలిసిందే. గతేడాది వచ్చిన ఈ సినిమాలో రుహానీ పరిధికి మించి బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్‌ చేసింది. ఈ సినిమా కొద్ది రోజుల క్రితం ఓటీటీలో విడుదల కావడం..అందులోని బోల్డ్‌ సన్నివేశాలు..ఆమె ప్రైవేట్‌ వీడియోలు అంటూ సోషల్‌ మీడియాలో పెట్టడంతో అవి ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి.

దీనికి సంబంధించి రుహానీ క్లారిటీ ఇస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది‘‘ఆగ్రా’లోని సన్నివేశాలు లీక్‌ అయినప్పటినుంచి నేను ఎంతో బాధలో ఉన్నాను. నా బాధను వివరించడానికి నిరుత్సాహం అనేది కూడా చిన్నమాటే. మా కష్టాన్ని, అంకితభావాన్ని విస్మరించి కేవలం కొన్ని సీన్స్ ను  మాత్రమే వైరల్‌ చేయడం అనేది ఒక దిక్కుమాలిన,  నీతిమాలిన చర్య. ఆర్ట్ సినిమాలను రూపొందించడం సవాలుతో కూడుకున్న పని. వాటి కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చింది.

అలాంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నాం.  మా కష్టాన్ని, కన్నీళ్లను అర్థం చేసుకోకుండా కొందరు దానిగురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ చిత్రాన్ని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2023లో ప్రదర్శించారు. అది మా యూనిట్ కు దక్కిన గౌరవం. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇంత గొప్ప సినిమాలో నటించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఈ సినిమా శైలిని అందరూ గుర్తించాలని వేడుకుంటున్నాను.

కళ ఎప్పుడూ సులభంగా, సౌకర్యవంతంగా ఉండదు. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కళాకారుల శ్రమను వృథా చేయకండి. సినిమా గొప్పతనాన్ని చూడండి’ అని ఆ లేఖలో రుహానీ రాసుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles