వెట్టైయన్‌ నుంచి సూపర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన అనిరుధ్‌!

Sunday, December 22, 2024

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా ‘వెట్టైయన్’ . ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను టీజే.జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమా నుంచి వరస అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నారు చిత్ర బృందం.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ని అభిమానుల ముందుకు తీసుకుని వచ్చాడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ త్వరలో రానున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. వారితో పాటు రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles