జటధార నుంచి సుధీర్‌ బాబు ఫస్ట్‌ లుక్‌ అదిరింది!

Sunday, December 22, 2024

నవదళపతి సుధీర్ బాబు నటించిన తాజా సినిమా  ‘హరోం హర’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర బృందం తెరకెక్కించగా, సుధీర్ బాబు పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు సుధీర్ బాబు తన కొత్త సినిమాపై ఓ  అప్డేట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ‘జటాధర’ అనే మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ పోస్టర్ చూస్తుంటే, ఇందులో కూడా సుధీర్ బాబు ఓ పవర్‌‌ఫుల్ పాత్రలో యాక్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. శివన్ నారంగ్, ప్రేరణా అరోరా, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2025 మహాశివరాత్రికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles