“కల్కి” అవైటెడ్ అప్డేట్ వస్తుందా!

Thursday, April 10, 2025

పాన్ ఇండియా యంగ్‌  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకొణ్‌  తో పాటు దిశా పటాని ఫీమేల్ లీడ్ లో  నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “కల్కి 2898 ఎడి” గురించి అందరికీ  తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాలు మధ్య విడుదలై ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా  స్వాతంత్య్ర దినోత్సవం రోజుకి  50రోజులని కంప్లీట్ చేసుకుంది.

అయితే ఈ 50 రోజులు తర్వాత అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఓటీటీ కి సంబంధించి రానున్నట్టుగా ఇపుడు టాక్‌ వినిపిస్తుంది. కల్కి థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. దాదాపు 5 వారాలకి పైగానే థియేటర్స్ లో భారీ రన్ తో ముందుకు దూసుకెళ్లింది. ఇక ఫైనల్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా  రానున్న మరో వారం లోనే సాలిడ్ అప్డేట్ తో ఓ క్లారిటీ ఇవ్వనున్నట్టుగా సమాచారం. ఆల్రెడీ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఈ ఆగస్ట్ 23 నుంచి అందుబాటులోకి వస్తుంది అని టాక్ వినిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles