దేవరను ఢీకొట్టే భైర వచ్చేస్తున్నాడు!

Saturday, December 21, 2024

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “దేవర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్టీఆర్ నుంచి సోలోగా వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అలాగే నటుడు సైఫ్ అలీఖాన్ లు టాలీవుడ్ కి నేరుగాపరిచయం అవుతుండగా నేడు సైఫ్ బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని విడుదల చేశారు. మరి ఇందులో సైఫ్ అయితే  సూపర్‌ గా అదరగొట్టాడు అని చెప్పుకోవచ్చు. దేవర ని ఢీ కొట్టే పవర్ఫుల్ విలన్ లా సైఫ్ తన పాత్రలో కనిపిస్తుండగా తనపై ఫైట్ సీక్వెన్స్ కానీ బాక్గ్రౌండ్ లో సెటప్ అంతా చూస్తుంటే కొరటాల ఏదో కొత్త లోకమే సృష్టించాడు అని తెలుస్తుంది.

అలాగే రెండు డిఫరెంట్ షేడ్స్ లో సైఫ్ కనిపిస్తుండగా తనపై వదిలిన గ్లింప్స్ లో అనిరుద్ ఇచ్చిన స్కోర్ కూడా సూపర్‌ ఉంది. మొత్తానికి అయితే విలన్ ని కూడా కొరటాల ఓ రేంజ్ లోనే ప్లాన్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం అందిస్తుండగా ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles