పవన్ కల్యాణ్ మీద నిందలు వేయడానికి ఎవ్వరికీ ఏమీ కారణాలు దొరకవు. ఆయనను అనవసరంగా ఆడిపోరసుకోవడం కరెక్టు కాదని అది పార్టీకి చేటు చేస్తుందని.. జగన్మోహన్ రెడ్డికి ఆయన సీఎంగా ఉండగా చాలా మంది సలహాలు చెప్పారు కూడా. కానీ.. అవేమీ వర్కవుట్ కాలేదు. పవన్ కల్యాణ్ అంటే జగన్ లో అపరిమితమైన భయం ఉండేది. ఆ భయంతో.. ఎప్పుడు మీటింగు పెట్టినా జగన్ ను తిట్టిపోసేవారు. ప్రతిసారీ.. ఆయన ముగ్గురు భార్యల వ్యవహారం తప్ప మరో సబ్జెక్టు ఉండేది కాదు. కానీ.. పవన్ వైవాహిక బంధం పట్ల చాలా గౌరవంతో, చాలా నిజాయితీగా, భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రమే మరొకరిని పెళ్లిచేసుకుంటూ పద్ధతిగా జీవించే వ్యక్తి అని ప్రజలు మాత్రం ఆదరించారు.
అయితే జగన్మోహన్ రెడ్డి నిజంగా అంతటి సచ్ఛీలుడా? అంటే ప్రజలకు నవ్వు వస్తోంది. ఆయన చాలా అతిగా ప్రోత్సహించిన నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ రంకు బాగోతం ఇవాళ బజార్న పడింది. టెక్కలి రాజకీయాల్లో వైసీపీ పాలనలో కీలకమైన వ్యక్తిగా చక్రం తిప్పిన దువ్వాడ శ్రీనివాస్.. తన భార్యను, పిల్లల్ని గాలికి వదిలేసి మరో మహిళతో ఉంటూ ఉండడం రచ్చకెక్కింది. ఇలాంటి వారిని జగనే కదా.. అంతగా ప్రోత్సహించారు అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
దువ్వాడ కుటుంబ రాజకీయాలు ఒక్కసారిగా బజార్నపడ్డాయి. భార్యా భర్తలు ఇద్దరూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇద్దరినీ ప్రోత్సహించారే తప్ప.. వారి కుటుంబంలో ఉన్న అసహ్యకరమైన వివాదాన్ని సర్దుబాటు చేయడానికి కనీసంగా కూడా ప్రయత్నించలేదు. వారి కుటుంబానికి స్థానికంగా ఉండే హవాను జగన్ పార్టీకి అనుకూలంగా వాడుకోవాలని అనుకున్నారే తప్ప.. పార్టీ నాయకులకు నిర్దిష్టంగా కొన్ని విలువలు ఉండాలని అనుకోలేదు. అందుకే ఇవాళ ఇలా దువ్వాడ శ్రీనివాస్ రంకు బాగోతం బజార్నపడితే.. అందుకు ప్రజలు జగన్ ను కూడా నిందిస్తున్నారు. దువ్వాడ పుణ్యమా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువు గంగలో కలుస్తున్నదని.. అందుకు జగన్ కూడా బాధ్యత వహించాల్సిందేనని పార్టీ శ్రేణులు కూడా అంటున్నాయి.
నీతులు మాట్లాడే జగనే వీరినీ ప్రోత్సహించారు!
Friday, November 22, 2024