ఓజీకి డేట్స్ ఇచ్చిన పవర్‌ స్టార్‌!

Thursday, September 19, 2024

టాలీవుడ్ లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఇటు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా పవన్ రియల్ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకోగా ఇప్పుడు తన పొలిటికల్ పనుల్లో ఆయన చాలా బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ చేస్తున్న చిత్రాల్లో వెంటనే మొదలు పెట్టాల్సిన సినిమాలు అయితే రెండు ఉన్నాయి.

వాటిలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేయనున్న సాలిడ్ యాక్షన్ మూవీ “ఓజీ” ఒకటి కాగా ఇప్పుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా షూటింగ్ ని అయితే పవన్ మొదలు పెట్టేందుకు తన డేట్స్‌ని ఇచ్చేశారట. ఈ అక్టోబర్ 1 నుంచి రెండు వారాలు వరకు పవన్ అయితే ఈ చిత్రాలకి తేదీలను కన్ఫార్మ్‌ చేశారు.

దీంతో మేకర్స్ ఎదురు చూస్తున్న టైం రానే వస్తుంది అని చెప్పాలి. ఇది వరకు వారు కూడా కేవలం 14 నుంచి 15 రోజులు మాత్రమే పవన్ పై సన్నివేశాలు ఉన్నాయని అవి అయిపోతే సినిమా పూర్తి అయినట్లే అని వివరించిన సంగతి తెలిసిందే. సో మొత్తానికి ఓజి ఆగమనం అక్టోబర్ లో ఉండనుందని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles