టాలీవుడ్ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రానా దగ్గుపాటి…. కథ ఏదైనా సరే తనదైన శైలీలో ఆ పాత్రకు ప్రాణం పోసేస్తాడు. బాహుబలిలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించాడు. కానీ సోలో హీరోగా ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజతో ‘రాక్షసరాజా’ అనే సినిమాను రానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో ప్రముఖ స్టార్ నటుడు మోహన్ లాల్ నటిస్తాడంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి. రానా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. తేజ డైరెక్షన్ లో రానా ‘రాక్షస రాజా’తో భారీ హిట్ కొడతాడు అనుకుంటే ఈ సినిమా అకారణంగా ఆగిపోయినట్టు సమాచారం.
దీంతో రానా అభిమానులు కాస్త నిరుత్సహం చెందారు. కాగా గతంలో ‘రాక్షస రాజా’ నుంచి పోస్టర్ ని విడుదల చేయగా సినిమాపై భారీ హైప్ లు క్రియేట్ అయ్యాయి. ఇంతకుముందు రానా – డైరెక్టర్ తేజ కాంబోలో వచ్చిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ . ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఆ చిత్రంలో రానాను సరికొత్తగా చూపించాడు డైరెక్టర్ తేజ.
రానా – కాజల్ మధ్య ప్రేమ, రాజకీయ పరిణామాలు అన్నీ సన్నివేశాలను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించాడు. ఇప్పుడు వారిద్దరి కాంబోలో ఆ తరహా సినిమా ఉంటుందని అభిమానులు సంతోషించే లోపే ‘రాక్షసరాజా’ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం రానా ‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వెంకటేశ్ – రానా నటించిన రానా నాయుడు సిరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. దానికి కొనసాగింపుగా ఈ సిరీస్ రాబోతుంది. మరి రానా దగ్గుపాటిని స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడో వేచి చూడాల్సిందే.