పవర్‌ పోలీసు ఆఫీసర్ గా యంగ్‌ హీరో!

Sunday, December 22, 2024

ప్రస్తుతం యంగ్ హీరోలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ విశ్వక్ సేన్ మాత్రమే అని చెప్పొచ్చు. ఈ ఏడాది ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ను పలకరించి మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన  ఈ సినిమా ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.

ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ సేన్ మరో సినిమాను స్టార్ట్ చేశాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో నూతన దర్శకుడు శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఖాకీ డ్రెస్ ధరించి గన్ ను చూపిస్తూ, ముఖం కనిపించకుండా వెనక నుండి విశ్వక్ ను పోస్టర్ డిజైన్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ప్రతి చర్యకు నిప్పులాంటి ప్రతిచర్య ఉంటుందని పోస్టర్ లో రాశారు.

ఇదంతా చూస్తుంటే ఇదేదో పవర్ ఫుల్ పోలీస్ కథా నేపథ్యం ఉన్న సినిమాలాగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా విశ్వక్ కెరీర్ లో 13వ సినిమాగా రానుంది.ఎస్‌ఎల్వీ బ్యానర్ లో 8వ సినిమాగా రానున్న ఈ ఈ సినిమాకు అజనీష్ లోకానాధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ‘లైలా’ సినిమాలోనూ నటిస్తున్నాడు విశ్వక్ సేన్.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles