“సరిపోదా శనివారం” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్!

Thursday, September 19, 2024

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాని ఇప్పుడు తాజాగా  సరిపోదా శనివారం చిత్రంతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 29, 2024 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైయ్యేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తుండగా, విలక్షణ నటుడు ఎస్. జే. సూర్య ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మూవీ మేకర్స్ ఈ చిత్రం నుండి మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. పోస్టర్ లో హీరో నాని లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. చేతిలో ఆయుధంతో కనిపిస్తున్న నాని లుక్ అభిమానులను  అలరిస్తుంది. హాయ్ ఆగస్ట్, నువ్వు ఎండ్ అయ్యే సమయానికి మేము స్టార్ట్ అవుతాం అంటూ దీనికి చిత్ర బృందం క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ నెలాఖరున విడుదల కానున్న సరిపోదా శనివారం సినిమాకి వివేక్ ఆత్రేయ రచన, దర్శకత్వం అందిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles