ఆ హీరోయిన్‌ తో మెగా హీరో పెళ్లి..అసలు విషయం ఏంటంటే!

Thursday, September 19, 2024

ఈ మధ్యకాలంలో సాయిధరమ్ తేజ్ మెహరీన్ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి.  వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారని ప్రచారం జరిగింది. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి జవాన్ అనే సినిమాలో యాక్ట్‌ చేశారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు వాళ్ళు డేటింగ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ వాటిలో ఏది నిజం లేదు.

తర్వాత మెహ్రీన్ ఒక పొలిటీషియన్ తో పెళ్లికి సిద్ధమై ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి దానిని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని సినిమాలు చేసే పనిలో  బిజీగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్లి అనే వార్త మరోసారి తెర మీదికొచ్చింది. ఇదే విషయం గురించి తేజ్ టీం ని సంప్రదించే ప్రయత్నం చేయగా అవన్నీ రూమర్లే అని కొట్టి పారేశారు.

ఆయన పెళ్లి గురించి ఎలాంటి సమాచారం ఉన్న మేమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఇది కూడా నమ్మలేమని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ప్రేమలో ఉన్న పలువురు హీరో హీరోయిన్లు ముందు అదేది నిజం కాదని ఖండించి చివరికి ఒకటైన సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో భాగమయ్యాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles