సూర్య మాస్‌ కం బ్యాక్ ఇవ్వనున్నాడా?

Monday, September 16, 2024

తమిళ సినిమా నుంచి వచ్చిన హీరోస్ ఎప్పుడో మన తెలుగులో కూడా కోలీవుడ్‌ తో సమానంగా టాలీవుడ్‌ లో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో సూర్య కూడా ఒకరు. మరి సూర్యకి థియేట్రికల్ గా రీసెంట్ గా అనుకున్న రేంజ్ సక్సెస్ లు పెద్దగా లేవు. తాను గెస్ట్ రోల్ లో చేసిన సినిమాలు తప్ప తాను హీరోగా చేసిన సినిమా “ఈటీ” డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో  సూర్య నెక్స్ట్ భారీ చిత్రం “కంగువా” దర్శకుడు శివతో చేస్తున్నాడు.

అయితే దీనిపై భారీ అంచనాలు మొదటి నుంచి భారీ లెవల్లో ఉన్నాయి. కానీ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రావడం దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటుగా సినిమాలో సూర్య రోల్ కూడా పవర్ఫుల్ గా ఉన్నట్లు టాక్‌ వినిపిస్తుంది. మరి దీంతో పాటుగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్న క్రేజీ గ్యాంగ్ స్టర్ డ్రామా గ్లింప్స్ కూడా ఊహించని లెవెల్లో ఉండేసరికి ఈసారి సూర్య కం బ్యాక్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు మాస్ హిట్స్ పడేలా ఉన్నాయని తెలుస్తుంది. మరి సూర్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హిట్స్ ఈ సినిమాలతో సూర్య అందుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles