త్రివిక్రమ్ సర్ప్రైజ్ ఎంట్రీతో ఆనందంలో ముద్దుగుమ్మ!

Wednesday, December 18, 2024

టాలీవుడ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చివరిగా చేసిన సినిమా  సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం. ఈ సినిమా భారీ వసూళ్లతో రీజనల్ గా ఫర్వాలేదనిపించింది. అయితే ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ తన తాజా సినిమాలతో బిజీ కానుండగా లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఉన్నట్టుగా కూడా సమాచారం.

తాజాగా త్రివిక్రమ్ అయితే ఓ యంగ్ హీరోయిన్ సినిమా సెట్స్ లో  సర్ప్రైజ్ విజిట్ చేసి షాక్‌ ఇచ్చారు. ఆమె మరెవరో కాదు నటి సీరత్ కపూర్ కాగా ఆమె చేస్తున్న తాజా సినిమానే “ఉషాపరిణయం”. ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ కే దర్శకత్వం వహిస్తుండగా శ్రీ కమల్ హీరోగా తన్విక హీరోయిన్ గా చేస్తుండగా ఈ సినిమాలో సీరత్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే మరి ఈ సినిమా సెట్స్ లోకి త్రివిక్రమ్ రావడంతో ఈ యంగ్ హీరోయిన్ ఫుల్‌ ఖుషీ అవుతూ ఆ సంతోషాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆయన నా సినిమా సెట్స్ లోకి రావడంతో ఎంతో ఆనందంగా ఉందని అంతే కాకుండా త్రివిక్రమ్ సార్‌ మానిటర్ లో నాపై సీన్స్ ని చూడడం ఈ స్పెషల్ మూమెంట్స్ అంతా గాడ్ ప్లాన్ అంటూ చాలా ఎగ్జైట్ అవుతూ పోస్ట్ చేసింది.

ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ కి థాంక్స్ చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదల అవుతుండగా ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే విజయ్ భాస్కర్ నే నిర్మాతగా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles