సాధారణంగా నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ అనే మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. తమ పరువు పోయే అనేక సందర్భాలలో ఇతరుల పరువు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అలాంటి కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ఉన్న అక్రమ సంబంధాలు, అక్రమ లావాదేవీలు, భూకబ్జాలు, బినామీ వ్యవహారాల గురించి ఆరోపణలు వెల్లువగా వస్తున్న తరుణంలో.. ఆయన తెలుగుదేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తున్నదని ఎక్స్ లో ట్వీట్లు పెడుతున్నారు. అయితే ఆయన కులం విషానికి తెలుగుదేశం పార్టీ దీటైన కౌంటర్లు ఇస్తోంది.
ఎన్నికలలో ప్రజలు అత్యంత నీచంగా తిరస్కరించిన పరాజితుడివి నువ్వు. కులం మీద విషం కక్కడం మానుకో అని టిడిపి ఆయన ట్వీట్ కి కౌంటర్ ఇచ్చింది. ‘అనేక రకాల తప్పుడు పనులు చేసినందుకు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించినందుకు ప్రజలను అనిశ్చితిలో పడవేసినందుకు మీ పాపాలన్నీ పండి మీ నాయకుడిని, పార్టీని ప్రజలు అత్యంత నీచంగా 11 స్థానాలకు పరిమితం చేస్తూ ఓడించారు. నువ్వు ఇదే విధంగా ప్రజల మీద విషం కక్కడాన్ని కొనసాగిస్తూ పోతే.. కులం బురదను, మతం విషాన్ని వ్యాపింపజేయాలని కుట్రలు చేస్తే 2029 ఎన్నికల్లో మీ పార్టీ సింగిల్ డిజిట్ కు పడిపోతుంది. ఈ ట్వీట్ ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకో అంటూ తెలుగుదేశం కౌంటర్ ఇచ్చింది.
విజయ్ సాయి రెడ్డి తనమీద వస్తున్న ఆరోపణల విషయంలో స్పందించలేక, వాటి నుంచి తప్పించుకోలేక, ఆ ఒత్తిడిలో ఏం చేయాలో తెలియక అడ్డగోలుగా తెలుగుదేశానికి కులం బురద పులిమేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రజలు ఇంతగా తిరస్కరించిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి అదే తరహా పాచిపోయిన పాత వాసన కొట్టే కులవిద్వేషాల ముసుగు కిందనే రాజకీయాలు చేయాలనుకుంటే ఆయనకు భవిష్యత్తు కూడా ఉండదని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
విజయసాయిరెడ్డి కుల విషానికి తెదేపా ఘాటైన కౌంటర్!
Monday, December 23, 2024