అధికారంలో లేరు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా తమ దందాలను అరాచకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికీ వారి వేధింపులు గురించి వేర్వేరు ప్రాంతాలలో ప్రజల ఫిర్యాదులు ఒక్కటొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అటు బయటకు చెప్పుకోలేక, ఇటు వారి వేధింపులను భరించలేకపోయిన వారు మాత్రం జీవితాలనే కడతెర్చుకునే పరిస్థితి ఏర్పడుతోందా అని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అనిపిస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ రెండు రోజులుగా అదృశ్యం కావడం, చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజీ పంపడం.. ప్రభుత్వ మాజీ విప్ ప్రసాదరాజు వేధింపులు భరించలేకనే చనిపోతున్నట్లుగా చెప్పడం అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.
నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ ఈనెల మూడో తేదీనుంచి మెడికల్ లీవుపై ఉన్నారు. ఆయన స్వస్థలం పెనమలూరు వెళ్లారు. అయితే సోమవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిన వెంకటరమణ మళ్లీ తిరిగిరాలేదు. తన భర్త కనిపించడం లేదంటూ నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్ ను సైతం కారులోనే వదిలి వెళ్ళినట్లుగా గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుకుంటున్నారు.
ఆయన భారీ నుంచి ఫిర్యాదు స్వీకరించిన తర్వాత మంగళవారం రాత్రి నుంచి పోలీసులు ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంపీడీవో వెంకటరమణ మృతదేహం కోసం వెతుకుతున్నారు.
ప్రచారంలో ఉన్న విషయాల్ని బట్టి వివరాలివీ.. నర్సాపురం రేవు పాటదారుడు ప్రభుత్వానికి యాభై లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము చెల్లించాల్సిందిగా అడిగినందుకు ఎంపీడీవోపై రాజకీయ ఒత్తిడులు వచ్చాయి.
సదరు పాటదారుడు డబ్బు కట్టకపోగా, ఆయన తరఫున మాజీ ఎమ్మెల్యే, గత ప్రభుత్వ విప్ ప్రసాద రాజు బెదిరించినట్టుగా అనుకుంటున్నారు. ఆయన డబ్బు కట్టకపోవడం అనేది తనకు ఇబ్బంది అవుతుందనే ఒత్తిడిలో వెంకటరమణ ఆత్మహత్యకు ఒడిగట్టారని అనుకుంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉండగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని చెలరేగిపోయారో అందరికీ తెలుసు. ప్రభుత్వ అధికారులను బానిసల్లాగా చూస్తూ వచ్చారు. అలాంటి పోకడల పలితమే ఇప్పుడు ఎంపీడీవో ప్రాణాలను బలిగొన్నదని ప్రజలు అనుకుంటున్నారు.