రోటి కపడా రొమాన్స్’ మూవీ మూడో పాటను విడుదల చేయబోతున్న విశ్వక్‌!

Wednesday, September 18, 2024

డైరెక్టర్‌ విక్రమ్‌ తెరకెక్కించబోతున్న తాజా సినిమా  ‘రోటి కపడా రొమాన్స్’. ఇందులో హర్ష నర్రా, సందీప్ సరోజ్, సుప్రజా రంగ, తరుణ్, సోను ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ కీలక పాత్రల్లో ఈ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాని లక్కీ మీడియా మిరాకీ బ్యానర్‌పై బెక్కమ్ వేణుగోపాల్, సృజన్ కుమార్ గ్రాండ్‌ గా నిర్మించబోతున్నారు.

ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్ మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, రోటి కపడా రొమాన్స్ సినిమా నుంచి ‘గలీజ్’ అని సాగే మూడో పాటను విశ్వక్ సేన్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీనిని జులై 15న 6.39 గంటలకు సాయంత్రం ప్రసాద్ లాబ్స్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఈ మూవీ 2024 చివరిలో విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles