అప్పుడు మిస్‌ అయిన ఇప్పుడు వదిలేదే లేదు!

Thursday, September 19, 2024

టాలీవుడ్‌ స్టార్ హీరో పవన్‌ కల్యాణ్‌ ఏపీకి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఆయన సినిమాలు గత కొన్ని నెలలుగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే పవన్ ఇప్పుడు వరకు నటించిన సినిమాల్లో ప్రముఖ యాంకర్ అనసూయ పవన్ తో ఓ సినిమాలో చేయాల్సి ఉంది.

కానీ వీరి కాంబినేషన్‌ ఎప్పటి నుంచో మిస్‌ అవుతూ వస్తుంది. అసలు వీరిద్దరూ కలిసి పవన్ ఇండస్ట్రీ హిట్ “అత్తారింటికి దారేది” సినిమాలో అవకాశం ఆమె మిస్ చేసుకుంది అని కూడా టాక్ ఉంది. అయితే ఫైనల్ గా ఇప్పుడు అనసూయ పవన్ తో ఓ సినిమాలో నటించబోతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ఆమె పవన్ ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల్లో ఎందులో చేస్తుందనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు కానీ ఆమె ఆ సినిమా విడుదల కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. మరి మొత్తానికి అయితే అప్పుడెప్పుడో మిస్ అయిన అవకాశం ఇప్పుడు దక్కించుకుంది అని చెప్పుకోవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles