కళ్లల్లో ఫైర్‌..మాటల్లో స్పష్టత..!

Saturday, October 5, 2024

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ శ్రీలీల గతంలో వరుస సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్ల సరసన చేరిపోయింది. వరుస సినిమాలు చేసి ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసింది. కానీ వరుస పెట్టి ఓ నాలుగు ప్లాపులు పడటంతో అమ్మాడి క్రేజ్‌ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో కొద్ది కాలంగా సినిమాలకు కొంచెం గ్యాప్‌ ఇచ్చి పలు యాడ్స్‌ లో నటించింది.

ప్రస్తుతం శ్రీలీల రవితేజ, నితిన్‌ సినిమాలతో సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే పవన్‌ కల్యాణ్‌ ఉస్తాద్‌ భగత్ సింగ్‌ సినిమాలో నటిస్తుంది. అమ్మడు మళ్లీ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ఇంతకుముందున్న ఉన్న క్రేజ్ ను సొంతం చేసుకుంనేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన తాజా ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను మాయ చేస్తుంది. తాజాగా, శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు పోస్ట్‌ చేసింది. వైట్ షర్ట్ బ్లాక్ షూస్, సూట్ ధరించి మత్తెక్కించే చూపులతో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది. అంతేకాకుండా ‘‘కళ్లల్లో ఫైర్.. మాటల్లో స్పష్టత ఉంటుంది. కాబట్టి వీటిని తినండి’’ అనే క్యాప్షన్ కూడా జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles