లోక నాయకుడు కమల్ హాసన్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ కాంబోలో చాలా కాలం కిందట వచ్చిన ఇండియన్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లోనే థియేటర్లలలో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ రూపుదిద్దుకుంటుంది.
ఈ సీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ మూవీని జూన్ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
జులై 12న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ రిలీజ్ పోస్టు పోన్ కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా మేకర్స్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 16న ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని దర్శకుడు శంకర్ ప్లాన్ చేసారు. ఈక్రమంలోనే ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు గ్లోబల్ స్టార్ రాంచరణ్ ను ఆహ్వానించ్చినట్లు సమాచారం. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 1వ తేదీన నిర్వహించనున్నట్లు సమాచారం.మరి ఇండియన్ 2 ఈ డేట్ కైనా విడుదల అవుతుందో లేదో చూడాలి .