కేన్స్‌ ఫెస్టివల్‌ మెరవబోతున్న కియారా!

Friday, December 5, 2025

యావత్‌ సినీ ప్రపంచం అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2024 కు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హాజరుకానున్నారు. ఉమెన్ ఇన్ సినిమా గాలాలో ఆమె భారత్‌ కి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తుంది. ఓ నివేదిక ప్రకారం.. కేన్స్ 2024లో రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్‌’లో కియారా పాల్గొనబోతున్నారు. ఇదివరకు ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్.. వంటి బాలీవుడ్ హీరోయిన్స్ అంతా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ మే 14 నుండి 25 వరకు జరగనుంది.రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్‌లో కియారా అద్వానీ, సల్మా అబు దీఫ్, సరోచా చంకిమ్హా, అధ్వా ఫహద్, అసీల్ ఒమ్రాన్, రమతా టౌలే సై పాల్గొంటారు. వినోద రంగానికి వీరి సహకారాన్ని గుర్తిస్తుంది. గ్లోబల్ ఇన్సెంటివ్‌లు, చిత్రీకరణ గురించి నాలుగు ప్యానెల్ చర్చలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో జరుగుతాయని వానిటీ ఫెయిర్ వివరించింది. మే 18న లా ప్లేజ్ డెస్ పామ్స్‌లో ఈ ఫెస్టివల్ జరగనుంది.

లోరియల్‌కి అంబాసిడర్‌లుగా ఉన్న ఐశ్వర్య రాయ్, అదితి రావు హైదరీ కూడా ఈ ఫెస్టివల్లో సందడి చేయనున్నారు. ఐశ్వర్య కేన్స్‌కు రెగ్యులర్‌గా హాజరవుతుండగా.. అదితి 2022లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles