దేవర టైమ్‌ కి గేమ్‌ ఛేంజర్‌!

Sunday, October 6, 2024

ఆర్‌ఆర్‌ఆర్ తరువాత మెగా పవర్‌ స్టార్‌ నటిస్తున్న చిత్రం గేమ్‌ చేంజర్‌.  చరణ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ పై వినిపిస్తున్న బజ్ ఏమిటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రం రిలీజ్ డేట్ కి గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం ను ముందుగా అక్టోబర్ 10 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఓజి చిత్రం విడుదల తేదీ (సెప్టెంబర్ 27) పై దేవర చిత్రం రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దేవర ప్రీ పోన్ ప్లాన్, గేమ్ చేంజర్ కి కలిసి వచ్చే అంశమనే చెప్పుకొవచ్చు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles