మరోసారి రౌడీ హీరోతో జత కట్టనున్న నేషనల్‌ క్రష్‌!

Saturday, September 28, 2024

యంగ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో , డైరెక్టర్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా వీడీ 14.ఈ చిత్రానికి టైటిల్‌ ను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్‌ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

రాహుల్‌ గతంలో  విజయ్ తో టాక్సీవాలా అనే చిత్రాన్ని డైరక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పీరియాడికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్‌ అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. తాజా విషయం ఏంటంటే, ఈ చిత్రం లో ఫిమేల్ లీడ్ రోల్ లో స్టార్ హీరోయిన్ రష్మిక  నటించనున్నది. అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు సమాచారం.

ఇప్పటికే డియర్ కామ్రేడ్,  గీత గోవిందం చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇది వారికి హ్యాట్రిక్ చిత్రం అని చెప్పాలి. అక్టోబర్ లో ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రం కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇది 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగే కథ అని పోస్టర్ లో పేర్కొన్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles