ఆసక్తికరంగా ప్రసన్న వదనం రిలీజ్‌ ట్రైలర్‌!

Friday, November 22, 2024

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుహాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించిన సుహాస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఆ సినిమా సూపర్ హిట్ అయింది . ఆ తరువాత సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా కూడా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది.

రీసెంట్ గా సుహాస్ నటించిన “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా కూడా సూపర్ హిట్ అయింది.  మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇలా వరుస హిట్స్ తో సుహాస్ దూసుకుపోతున్నాడు .వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహించాడు..ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ,  రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్‌పై మణికంఠ JS మరియు ప్రసాద్ రెడ్డి TR సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.“ప్రసన్నవదనం”మూవీ మే 03న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లోవేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.. సుహాస్ ఈ సినిమాలో ఫేస్ బ్లైండ్‌నెస్ అనే వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి వచ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి ఫేస్ తప్ప అన్ని గుర్తుపడతారు.

అయితే ఈ వ్యాధి ఉన్న సుహాస్‌కు అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి సుహాస్ ఏ విధంగా బయటపడ్డాడు అనేది సినిమా కథ..రిలీజ్ అయిన ట్రైలర్ ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది.. మరో కాన్సెప్ట్ బేస్డ్ కథతో సుహాస్ ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles