తెలుగు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాది హనుమాన్ సినిమాతో హ్యట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి ఏకంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. హనుమాన్ ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’పైనే పడింది.
అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించిన టీమ్ ఇప్పటి వరకు సినిమా షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పెండింగ్ లో ఉన్న సినిమా పై తన దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కన్నా ముందు అనుపమ పరమేశ్వరన్ తో ఓ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఆ సినిమా దాదాపుగా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమాను త్వరగా పూర్తి చెయ్యాలని డైరెక్టర్ భావిస్తున్నాడు . ఆ సినిమాను ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు..
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనుపమ సినిమా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. రణ్వీర్ సింగ్‌తో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్ నడుస్తుంది. దీన్ని బట్టి ప్రశాంత్ మొదటిగా బాలీవుడ్ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే ‘జై హనుమాన్’ సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే 2026 కే జై హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది.