చంద్రబాబుపై కక్ష సాధింపులోనూ బరితెగింపు..?

Friday, November 22, 2024

చంద్రబాబునాయుడు మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది. అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు సమీక్షించి.. వరుసగా ఆయన మీద మరిన్ని కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. లిక్కర్ వ్యాపారులకు మేలు చేశారనే నింద మోపి.. తాజాగా సీఐడీ కేసులు నమోదు చేయడం, ఏసీబీ కోర్టులో ఎఫ్ఐఆర్ సమర్పించడం చ్రచనీయాంశం అవుతోంది.

కక్ష సాధింపు విషయంలో ఇంతకంటె వేరే పాతాళాలు ఉంటాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.? ఇదే లిక్కర్ వ్యాపారంలో ఒకవైపు ప్రతినెలా వేలకు వేల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం , పెద్దలు అక్రమంగా స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. పాతప్రభుత్వం లిక్కర్ విషయంలో అవినీతికి పాల్పడినదంటూ.. చంద్రబాబునాయుడు మీద కేసులు నమోదు చేయడం చవకబారు, కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని ప్రజలు అంటున్నారు.

ఈ దేశంలోనే యూపీఐ లేదా ఆన్ లైన్ చెల్లింపులకు ఏమాత్రం అవకాశం కూడా లేని వ్యాపారాలు రెండే రెండు ఉన్నాయి. ఒకటి- ఏపీలో లిక్కర్ వ్యాపారం. రెండు- ఏపీలో ఇసుక వ్యాపారం అనేది ప్రజల మాట. ఈ రెండు వ్యాపారాల ముసుగులో అధికార పార్టీ నాయకులు ఈ నాలుగేళ్ల పదవీకాలంలోనే లక్ష కోట్లకు పైగానే కాజేశారనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. లెక్కలు మొత్తం గణాంకాల సహా వివరిస్తూ.. లిక్కర్ వ్యాపారం ద్వారా పొందుతున్న మొత్తంలో.. ఏడాదికి 30 వేల కోట్ల రూపాయలకు పైగా కాజేస్తున్నారని వివరించి చెప్పారు. ఈ వ్యవహారం మీద సీబీఐ విచారణ జరిపించాలని ఆమె ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కోరారు. పురందేశ్వరి విమర్శలకు జవాబు చెప్పకుండా.. ఆమెతో చంద్రబాబు కోసమే ఈ మాటలంటున్నట్టుగా వైసీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు తప్ప సంజాయిషీ చెప్పలేకపోయారు.

వాస్తవాలు ఇలా ఉండగా.. చంద్రబాబునాయుడు ప్రభుత్వ కాలంలో.. లిక్కర్ వ్యాపారులకు, బార్లకు ప్రివిలేజ్ ఫీజు ఎత్తివేశారని దీని ద్వారా 1300 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిందని అంటూ ప్రభుత్వం కొత్తగా కేసులు నమోదు చేసింది.
చంద్రబాబునాయుడు ను ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు నుంచి బయటకు రానివ్వకుండా చేయడానికి, విచారణలు, దర్యాప్తుల పేరుతో ఆయనను ఎప్పటికీ రిమాండులోనే ఉంచడానికి, తద్వారా అనుచిత రాజకీయ లబ్ధి పొందడానికి.. వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు ఇలాంటి నీచ రాజకీయానికి పాల్పడుతోందనే మాట వినిపిస్తోంది.

సంపూర్ణ మద్య నిషేధం తీసుకువచ్చి.. చెల్లెమ్మల జీవితాల్లో సంతోషాలు నింపుతాననే కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. నెలతిరిగే సరికి వేలకు వేల కోట్ల అక్రమంగా సంపాదించుకోవడానికి.. అదే లిక్కర్ వ్యాపారాన్ని మార్గంగా మార్చుకున్నారనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న సామెత చందంగా.. దొంగే.. పోలీసుని ‘దొంగ దొంగ’ అంటూ వెంటబడి తరిమినట్లుగా ఈ వ్యవహారం ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles