జాతీయ సంస్థ సర్వేతో తెదేపాలో జోష్!

Thursday, September 19, 2024

ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నప్పటికీ.. కొన్ని సంస్థలు నిర్వహించే సర్వేలు.. పార్టీలకు ఎంతో ఉపయోగపడతాయి. వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి, కొత్త జోష్ నింపుకుని ముందుకు సాగడానికి, లోపాలను సమీక్షించుకుని సరిదిద్దుకోవడానికి ఇవి సహకరిస్తాయి. కొంత కాలం కిందట టైమ్స్ నౌ విడుదలచేసిన సర్వే, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఏకంగా 24-24 ఎంపీసీట్లు దక్కుతాయని తేల్చగా.. ఆ పార్టీ పండగచేసుకుంది. ఇప్పుడు సీఓటర్- ఇండియా టుడే సంస్థ తమ సర్వే ఫలితాలను వెల్లడించి.. తెలుగుదేశానికి 15-20 సీట్లు దక్కుతాయని అనడంతో.. పండగ చేసుకునే వంతు తెలుగుతమ్ముళ్లకు వచ్చింది.

దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో  ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఏపీలో తెలుగు దేశం పార్టీకి ఎంపీ సీట్లలో 15 నుంచి 20 సీట్లు వరకు రావచ్చుననే విశ్లేషణ టిడిపి పార్టీలో ఫుల్ జోష్ నింపుతోంది. గతంలో టైమ్స్ నౌ ఛానల్ లో వచ్చిన సర్వేలో వైసీపీ పార్టీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పడం వైసిపి శ్రేణులు కూడా నమ్మలేక పోయాయి. దీనికి తోడు ఆ టైమ్స్ నౌ ఛానల్ కి అడ్వర్టైజ్మెంట్లు రూపంలో ఎనిమిది కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం చెల్లించినట్టు ఇంటర్నెట్‌లో ఎంతగా వార్తలు హల్చల్ చేశాయో అందరికీ తెలుసు. దాంతో ఆ సర్వే కి అంత విశ్వసనీయత లేకుండాపోయింది.

 కానీ ఎన్నికల సర్వేలలో దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉన్న సి ఓటర్ – ఇండియా టుడే ఛానల్తో కలిసి చేసిన సర్వేలో ఇలాంటి ఫలితాలు రావడం టిడిపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ సర్వే ప్రకారం ఎమ్మెల్యే సీట్లలో కూడా టిడిపికి 110 నుంచి 120 స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో టిడిపి పార్టీ ఈ సర్వే వలన తమపై తనకు నమ్మకం కలిగి ప్రజల్లోకి మరింత గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది.

అదేవిధంగా రాబోయే ఎన్నికల ముందు బిజెపి, జనసేన తో పొత్తు విషయంలో కూడా ఈ సర్వే ఓ ప్రభావం చూపనుండడంతో ఏపీ రాజకీయాలు ముందుముందు మరింత వేడెక్కనున్నాయి. ఇండియా టుడే ఛానల్ విశ్లేషణ ప్రకారం ఎన్డీయే లో బిజెపి కి తప్ప ఏ మిత్ర పక్షానికి ఇన్ని సీట్లు వచ్చే అవకాశం లేదని ఆ సర్వే పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తర భారతం లో తమకు తగ్గే సీట్లు ను ఎలాగైనా దక్షిణ భారతదేశంలో తెచ్చుకోవాలి అని చూస్తున్న బిజెపి తెలుగుదేశం పార్టీ తో తప్పక పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని భావించవచ్చు. పొత్తుల విషయం పక్కనపెడితే ఇంకా ఎన్నికలకు చాలా టైమ్ ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని, తద్వారా తమ పార్టీ కి మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని పొత్తులతో పని లేకుండానే తమ పార్టీ ఏపీ లో సంపూర్ణ మెజారిటీ సాధించే అవకాశం ఉందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles