మోదీ ప్రభుత్వం ముందు జగన్, చంద్రబాబు, పవన్ లొంగుబాటు!

Saturday, October 5, 2024

ఆంధ్ర ప్రదేశ్ లో విశేషమైన ప్రజాదరణ గల నేతలు ఎవరంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. రాజకీయంగా వారికి గల పట్టులో తేడాలు ఉన్నప్పటికీ, మరే నాయకుడికి రాష్ట్రంలో జనంలో చెప్పుకోదగిన ఆదరణ లేదని చెప్పవచ్చు. గత ఎన్నికలలో వారు ముగ్గురు ఒంటరిగా పోటీచేశారు. జగన్ సుమారు 52 శాతం ఓట్లు పొందితే, చంద్రబాబు 39 శాతం, పవన్ 6 శాతం ఓట్లు పొందారు.

ప్రస్తుతం వారి బాలబాలలో కొద్దో గొప్పో తేడాలు ఉన్నప్పటికీ మరెవ్వరైనా వారి తర్వాతే. అయితే గత ఎన్నికలలో 1 శాతం కన్నా తక్కువగా ఓట్లు తెచ్చుకొని, ఇప్పటికి సొంతగా ఒక్క సీట్ కూడా గెల్చుకోలేని బిజెపి ఆ ముగ్గురిని ఆడిస్తున్నది. ఢిల్లీ పెద్దల ముందు ఈ ముగ్గురు నేతలు `లొంగుబాటు’ ప్రదర్శించి, రాష్త్ర ప్రయోజనాల గురించి నోరు మెదపటం లేదు.

రాష్త్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా యిప్పటికీ అమలు కానీ కీలక అంశాలపై నోరు మెదపలేక పోతున్నారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి .. వంటి అపీలు అంశాలపై గత ఎన్నికలలో గంభీరమైన ప్రసంగాలు చేసిన ఈ నేతలు ఇప్పుడు దాదాపు మౌనం వహిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చిన సమయం అమలుకాని విభజన హామీలపై కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చేందుకు బంగారు అవకాశం కాగలదు. అయితే బేషరతుగా ఈ తార్మానంకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వంకు మద్దతు ఇచ్చేందుకు సిద్దపడుతున్నారు. కేంద్ర ఏం చేసినా గట్టిగా ఎదుర్కొనే పరిస్థితిలో అధికార, ప్రతిపక్షాలులేకపోవడంతో  ఒక్కశాతం ఓట్లు లేకపోయినా బిఎజిపి చాలా బలంగా ఉందంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎద్దేవా చేశారు. 

రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం తెలిసినా అడగలేని నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నారు.  రూ.4,117 కోట్లు మాత్రమే రెవెన్యూ లోటుగా కేంద్రం మొదటి నుంచి ప్రభుత్వం చెబుతూ వాస్తు ఇటీవల అకస్మాత్తుగా రూ 10,000 కోట్లకు పైగా మంజూరు చేసేసరికి సీఎం జగన్ ఆశ్చర్యపోయారు.  కేంద్రానికి లొంగి ఉంటె ఇష్టారీతిన నిధులు విడుదల చేస్తామనే సంకేతం ఇచ్చారు. 
 అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.35 వేల కోట్లు రెవెన్యూ లోటు రావాలని డిమాండ్ చేస్తూ రావడం గమనార్హం.  గతంలో బుందేల్‌ఖండ్ ప్యాకేజీ ఇస్తామని ప్రతిపాదన చేస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు 24,350 కోట్లు అని జగన్ చెప్పుకొచ్చారు. టాక్స్ బెనిఫిట్ పెద్ద ఎత్తున రాష్ట్రానికి రావాల్సి ఉందని  చెప్పారు. కానీ ఈ అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతున్నారు.

కేంద్రాన్ని నిలదీస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపై ప్రయోగిస్తారనే భయమే ఈ ముగ్గురు నేతలను లొంగి వ్యవహరించేటట్లు చేసిందని చెప్పవచ్చు. అవిశ్వాస తీర్మానంకు మద్దతు ఇచ్చే ధైర్యం చేయకపోయినా ఈ సందర్భంగా విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే విధంగా వైసీపీ, టీడీపీ నేతలు లోక్ సభలో మాట్లాడటం అవసరమని గుర్తించాలి.

ఏపీని దారుణంగా వంచిస్తున్న బీజేపీతో ఎన్నికల పొత్తుకోసం టీడీపీ, జనసేన, లోపాయికారి అవగాహన కోసం వైసీపీ వెంపర్లాడుతూ ఉండటం అందరికి తెలిసిందే. వీరెవ్వరు బీజేపీతో పొత్తు పెట్టుకొంటే తమకు అదనంగా ఓట్లు వస్తాయని మాత్రం భావించడం లేదు. కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి రక్షణ కోసం, ఎన్నికల సమయంలో అధికార పార్టీ దౌర్జన్యాల నుండి రక్షణ కోసం మాత్రమే ఆత్రుత చెందుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles