‘సుప్రీం’లో ఎంఎల్‌సి కవితకు ఊరట

Tuesday, November 5, 2024

ఏదేమైనా కర్ణాటక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఊపిరి పీల్చుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది. అప్పటి వరకు ఆమెను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని బిజెపి నేతలే అంటుండగా ఇప్పుడు వారెవ్వరూ ఆ కేసు ప్రసక్తే తీసుకు రావడంలేదు. 

పైగా, కవితను అరెస్ట్ చేస్తే గాని బిఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కయిందనే అపవాదు తొలగిపోదని బీజేపీలోని `అసమ్మతి నేతలు’ బహిరంగంగా వాఖ్యలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.  కొద్దిరోజుల క్రితం ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఢిల్లీ పిలిపించారు. 

ఆ రాత్రి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఆయన అప్పాయింట్మెంట్ ఇవ్వడం పట్ల వారిద్దరూ విస్మయం వ్యక్తం చేశారు. తమను ఢిల్లీకి పిలిపించి, తమ తర్వాత కేటీఆర్ కు సమయం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దానితో కేటీఆర్ ను కలవకుండా అమిత్ షా అప్పాయింట్మెంట్ ను రద్దు చేసుకున్నా, బిఆర్ఎస్ తో తెరచాటు సంబంధాలు మాత్రం కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఒక మహిళను ఈడీ విచారణకు పిలిపించి, రాత్రి పొద్దుపోయేవరకు విచారణ జరపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడంతో ఆమెకు చాలా ఉపశమనం కలిగిన్నట్లయింది.

గత మార్చి నెలలో ఎంఎల్‌సి కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు నోటీసులు ఇచ్చిన విషయంలో ఓ మహిళను ఇడి కార్యాలయానికి పిలిపించవచ్చా? అనే దానిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆమె పక్షాన నిలిచింది.

ఇడిపై కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. విచారణ కోసం మహిళను ఇడి కార్యాలయానికి పిలిపించవచ్చా? లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మహిళను ఢిల్లీలోని ఇడి కార్యాలయానికి పిలిపించి విచారించడానికి సవాల్ చేస్తూ ఎంఎల్‌సి కవిత పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం విచారణ చేసింది. కవిత పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని, ఆ పిటిషన్‌పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఇడిని ఆదేశించింది.

 ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహద్గీ వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు కూడా హాజరయ్యారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles