అవిశ్వాస తీర్మానంతో ఇరకాటంలో కేసీఆర్, రేవంత్

Thursday, December 19, 2024

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో తెలంగాణ రాజకీయాలలో ప్రధాన పార్టీలకు రాజకీయంగా ముప్పు ఏర్పడనుంది. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ – రెండూ అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించడంతో వారిద్దరూ ఒక్కటే అని బిజెపి చేస్తున్న ప్రచారంకు బలం చేకూరినట్లయింది.

బిఆర్ఎస్, బిజెపిల మధ్య ఫెవికాల్ బంధం ఉందని, అవి `ఢిల్లీలో దోస్తీ- గల్లీలో కుస్తీ’ అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఇప్పటివరకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు విమర్శలు కుప్పిస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్ వారిని గెలిపించినా వారు చివరకు బిఆర్ఎస్ లో చేరతారంటూ బిజెపి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నది.

అందుకనే కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బిఆర్ఎస్ సభ్యులు సంతకాలు చేయకుండా, వారు విడిగా మరో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. ఏదేమైనా ఇద్దరు కలిసి చేయడంతో వారిద్దరూ ఢిల్లీలో ఒక్కటే అనే సంకేతం ప్రజలకు వెళ్లే అవకాశం ఉంది. 

కేసీఆర్ సహితం జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా ఇతర ప్రతిపక్షాలతో చేతులు కలపలేక పోయినా, వారి అవిశ్వాస తీర్మానంపై మద్దతు ఇవ్వలేక, వ్యతిరేకింపలేక సొంతంగా మరో తీర్మానం పెట్టాలని కేసీఆర్ నిర్ణయించిన్నట్లు స్పష్టం అవుతుంది.  పైగా, ఈ మధ్య బిఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నట్లు మాట్లాడుతున్న ఎంఐఎం కూడా బిఆర్ఎస్ తీర్మానంపై సంతకం చేసింది.

అందుకనే, రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐం ఒకే తాను మొక్కలే అంటూ కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వీరిద్దరూ గతంలో కలిసి పనిచేశారని,  భవిష్యత్తులో చేస్తారని పేర్కొంటూ వీరిలో ఏ పార్టీకి ఓటు వేసినా మూడు పార్టీలకు వేసినట్లే అని స్పష్టం చేయసారు.

బీజేపీ ఈ మూడు పార్టీలతో గతంలో కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవబోదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణను పరిపాలించాయని గుర్తు చేస్తూ వాటిపై తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ విషయం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో మార్పు రావాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే, అవినీతి రహిత ప్రభుత్వం రావాలంటే  అది మోదీ నాయకత్వంలోని బీజేపీతో మాత్రమే సాధ్యం అని పేర్కొంటూ అందరూ ఈ విషయాన్ని గుర్తించాలని కోరడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రచార అస్త్రాన్ని కేంద్ర మంత్రి వెల్లడించారు.

కాంగ్రెస్, బిఅర్‌ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని పార్లమెంట్ సమావేశాల్లో బహిర్గతమైంది బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇరు పార్టీలు వ్యవహరించిన తీరుపై ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేసిన బిఅర్‌ఎస్‌కు వేసినా ఒకటేనన్న విషయంపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్ లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పది రోజుల ముందుగానే ఫ్రెండ్ షిప్ డే జరుపుకోవాలని చూస్తున్నాయని బిజెపి ఎంపి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు ఒక్కటే అని ప్రతిపక్షాల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. 2023లో తమ ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానం వస్తుందని 2019లోనే ప్రధాని మోదీ అంచనా వేశారని పార్లమెంట్‌లో ప్రధాని మాట్లాడిన ఓ వీడియోను బండి సంజయ్ ట్వీటర్‌లో షేర్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles