`లేడీ సింగం’ స్వర్ణలత వెనుక వైసిపి నేతలెవ్వరూ?

Friday, November 15, 2024

విశాఖలో సంచలనం రేపిన రూ.2000 నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలతపై చివరకు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్ ను కూడా సస్పెండ్ చేశారు. 

రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు విశ్రాంత నేవల్‌ అధికారులను మోసం చేయడంతో స్వర్ణలత దందా వెలుగులోకి వచ్చింది.బాధితులను బెదిరించి వారి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో పోలీసులు ఆర్‌ఐ స్వర్ణలతతో పాటు మధ్యవర్తి సూరిబాబు, ఏఆర్‌ కానిస్టేబుల్‌ హేమసుందర్‌, హోంగార్డ్‌ శ్రీనివాసులను శుక్రవారం అరెస్టు చేశారు. 

కోర్టు వీరికి ఈ నెల 21 వరకు రిమాండ్‌ విధించింది. నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై తొడకొట్టి మరీ సవాల్ చేశారు ఆర్ఐ స్వర్ణలత కీలక వైసిపి నేతల అండదండలతోనే అక్రమాలకు నిస్సిగ్గుగా పాలపడుతున్నట్లు తెలుస్తున్నది. ఆమెకు సినిమాలలో నటించాలని ఉండే పిచ్చిని ఆసరాగా తీసుకొని, ఆమెను హీరోయిన్ గా సినిమా తీస్తామని నమ్మబలికి, ఓ వైసీపీ నేత ఆమెతో అక్రమాలు చేయిస్తున్నట్లు చెబుతున్నారు.

సినిమాలో కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో హీరోయిన్ గా నటించబోతున్న పోస్టర్లతో సోషల్ మీడియాలో ఆమె కలకలం సృష్టిస్తున్నారు. ఆ వైసిపి నేత చెప్పడంతో సినిమా కోసం అని భరత నాట్యం కూడా నేర్చుకొంటూ, ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్నారు. 

ఈ కేసులో ఆమె అరెస్ట్ కాగానే ముఖ్యమంత్రి కార్యాలయం నుండే విశాఖ పోలీసులపై వత్తిడులు రావడంతో మాజీ నేవీ అధికారుల ఫిర్యాదును బుట్టదాఖలు చేయలేక పోయారు. దానితో ఎ 1గా ఉన్న ఆమెను ఎ 4గా మార్చి కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. ఒక సాధారణ ఆర్ఎస్ఐ కోసం సీఎంఓ నుండి ఫోనులు రావడం అంటే సాధారణ విషయం కాదని భావిస్తున్నారు.

గతంలో స్వర్ణలతపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న విశాఖ అధికారులు ఆమె శ్రీకాకుళం బదిలీ చేశారు. అక్కడి నుంచి విజయనగరం, తర్వాత  విశాఖపట్నంకు ఆమె తిరిగి బదిలీ చేయించుకో గలిగారు. ప్రస్తుతం ఆమె ఏఆర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ హోంగార్డుల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. 

డ్యూటీలో లేకపోయినా పోలీసు వాహనంలో ఇద్దరిని వెంటపెట్టుకుని దందా చేస్తోందని తెలిసింది. వీరి టీమ్ లో హోంగార్డు శ్రీను అక్రమంగా సంపాదించడంలే ఆరితేరిపోయాడు. వారానికి ఒకసారి రిజిస్టర్‌లో అన్ని సంతకాలు పెట్టి డ్యూటీకి వెళ్లకుండా స్వర్ణలత ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాడు. అదేవిధంగా కానిస్టేబుల్‌ హేమసుందర్‌ను కూడా స్వర్ణలత తన టీమ్ లో పెట్టుకుంది. వీరి సాయంలో బెదిరింపులకు పాల్పడుతూ దందా చేస్తుంది.

విశ్రాంత నావెల్‌ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌ తమ వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు సూరిబాబు అనే మధ్యవర్తిని ఆశ్రయించారు. రూ.90 లక్షల విలువైన రూ.500నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2000 నోట్లు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

నగదు మార్పిడిలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు సూరిబాబు.. ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత వద్ద హోంగార్డులుగా పని చేస్తున్న శ్యామ్‌ సుందర్‌, శ్రీనులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో హోంగార్డులు సూరిబాబును బెదిరించి రూ.10 లక్షల ఒప్పందాన్ని రూ.20 లక్షలకు తీసుకెళ్లారు. ఆ మొత్తాన్ని స్వర్ణలతతో పాటు అందరూ పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొల్లి శ్రీను, శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles