`టిడిపి ముక్త ఆంధ్ర ప్రదేశ్’ కోసం బీజేపీ ఎత్తుగడ!

Thursday, September 19, 2024

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ను నియమించబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అనూహ్యంగా జాతీయ ప్రధాన కార్యదర్శి డి పురందేశ్వరిని నియమిస్తారని ఎవ్వరూ ఊహించని లేదు. గతంలో కూడా ఆమె పేరు ప్రస్తావనకు వచ్చినా పార్టీలో కొన్ని వర్గాలు, ఆర్ఎస్ఎస్ నేతలు అడ్డుపడి కానీయలేదు.

గతంలో ఏపీ బీజేపీలో పెత్తనం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్గంతో గాని, ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఆధిపత్యం వహిస్తూ వచ్చిన సోము వీర్రాజు – జీవీఎల్ వర్గంతో గాని ఆమెకు సఖ్యత లేదు. మొదట్లో ఆమెను భుజం మీద వేసుకున్న ఆర్ఎస్ఎస్ పెద్దలు తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశారు.

రాజ్యసభకు వెళ్లి, కేంద్ర మంత్రివర్గంలో చేరాలనే ఆమె ప్రయత్నాలు తొమ్మిదేళ్లుగా ఫలించలేదు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసినా ఆమెకంటూ ప్రత్యేకంగా పార్టీలో చెప్పుకోదగిన పాత్ర లేకుండా చేశారు. ఇక బీజేపీలో తనకు మనుగడ లేదనుకొంటున్న సమయంలో ఆమెను ఈ పదవి వరించింది.

అయితే, వ్యూహాత్మకంగానే ఆమెను రాష్ట్ర అధ్యక్షురాలిగా చేసిన్నట్లు స్పష్టం అవుతుంది. ఏపీలో తిరిగి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడాలని బిజెపి పెద్దలు బలంగా కోరుకొంటున్నారు. ఇప్పటికే బిజెపితో స్నేహం చేస్తున్నాడని మైనారిటీలు, దళితులు జగన్ కు దూరంగా జరగడం ప్రారంభం కావడంతో కొద్దికాలంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు.

ఒక వంక ఆర్థికంగా జగన్ ను ఆడుకొంటూ, సిబిఐ కేసులలో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏర్పడకుండా కాపాడుతూ రాజకీయంగా మాత్రం `శత్రువులం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా టిడిపికి నెమ్మదిగా దగ్గరవుతున్న కొందరు మైనారిటీలను కూడా దూరం చేయాలనే ఎత్తుగడగా స్పష్టం అవుతుంది.

బిజెపి మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ `వైసిపి ముక్త ఆంధ్ర ప్రదేశ్’ పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీచేయాలని వత్తిడి తెస్తున్నారు. బీజేపీ కలిసి రాకపోయినా టిడిపితో కలుస్తానని సంకేతం ఇస్తున్నారు. టిడిపికి దగ్గర అవుతున్నామని సంకేతం ఇవ్వడం ద్వారా మైనారిటీలు ఆ పార్టీకి రాకుండా చేసి, పరోక్షంగా జగన్ కు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీ వ్యూహం మాత్రం `టిడిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్’ గా స్పష్టం అవుతుంది. ఈ ఎన్నికల్లో టిడిపిని ఓడిస్తే, ఆ పార్టీ మనుగడ సాగింపలేదని, దానితో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగవచ్చనే అంచనాకు బిజెపి పెద్దలు వచ్చారు. అందుకనే చంద్రబాబు నాయుడు భార్య సోదరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా చేయడం ద్వారా  టీడీపీకి మద్దతుగా ఉన్న సామాజిక వర్గంకు సానుకూల సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

గత కొంతకాలంగా కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులను రాష్త్ర అధ్యక్షులుగా చేయడం ద్వారా కాపు సామాజిక వర్గంను దగ్గరకు చేర్చుకుని, కమ్మ (టిడిపి), రెడ్డి (వైసీపీ) పార్టీలను మట్టికరిపించవచ్చని చెబుతూ బొక్కబోర్లా పడ్డారు, ఇప్పుడు టిడిపి మద్దతుదారులతో, అంటే వైసిపి వ్యతిరేకులతో ఎంతో కొంత చీలిక తీసుకురావడం ద్వారా వైసీపీ గెలుపుకు సహకరించాలని ఎత్తుగడ వేస్తున్నారు. 

గత ఆరేడేళ్లుగా కమ్మ సామాజిక వర్గాన్ని బిజెపిలో లేకుండా చేసేందుకు ప్రయత్నించి, ఇప్పుడు వారికి సానుకూల సంకేతాలు ప్రంపడం సాధ్యం అవుతుందా?  పైగా, గతంలో కాంగ్రెస్ వెవ్ ఉన్న సమయంలో రెండు సార్లు లోక్ సభకు ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి పొందిన ఆమెతో పాటు బిజెపిలోకి ఒక్కరు కూడా రాలేదు. ఒక సారి గెలుపొందిన చోట ఆమె మరోసారి గెలుపొందిన దాఖలాలు లేవు.

గతం తొమ్మిదేళ్లుగా ఏపీలో బీజేపీ అభివృద్ధి కోసం ఆమె చేసిన ప్రయత్నాలు అంటూ ఏమీ లేవు. కాంగ్రెస్ నుండి తనతో పాటు మరెవ్వరూ బీజేపీలో చేరి, పదవుల కోసం పోటీకి రాకుండా జాగ్రత్త పాడడంలో కన్నాతో కలిసి పనిచేశారు. కేవలం వైఎస్ జగన్ ను గెలిపించడం కోసం ఒక సాధనంగా మారే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles