రాజకీయ దుమారం రేపుతున్న ఎన్టీఆర్ అభిమాని మృతి

Monday, December 23, 2024

అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ మణికంఠ రామ్‌ప్రసాద్‌ అనే యువకుడు జూన్‌ 25న శనివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందడం రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ, వైసిపి నేతల మధ్య మాటల యుద్ధంపై దారితీస్తుంది. చేతి మణికట్టుపై బ్లేడ్‌ తో పలుసార్లు కోసుకుని, ఉరివేసుకున్న స్థితిలో శ్యామ్‌ మృతదేహం కనిపించింది.

ఆత్మహత్యకు ముందు యువకుడు సెల్ఫీ వీడియో విడుదల చేసి, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. శ్యామ్ ది హత్య కాదని, ఆత్మహత్య అని కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు. శ్యామ్ మృతికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన విడుదల చేశారు.

శ్యామ్ మరణం ఆత్మహత్య అని వార్తలు రాగా దానిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ తారక్ అభిమానులు, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. శ్యామ్‌ మృతిపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో వైకాపా నేతల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. లోతైన విచారణతోనే నిజాలు నిగ్గు తేలతాయని మంగళవారం ట్వీట్‌ చేశారు.
మ‌ణిక‌ట్టును కోసుకున్న అనంత‌రం ఉరేసుకుని చ‌నిపోయి ఉంటాడ‌ని పోస్టుమార్టం నిర్వ‌హించిన‌ వైద్యులు నిర్ధారించారు. అనంత‌రం మృత‌దేహాన్ని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. అత‌డి చావుకు ప్రేమ వ్య‌వ‌హారంతోపాటు, చ‌దువుల్లో వెన‌క‌బ‌డి ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు స్పష్టం చేశారు.

కోనసీమకు చెందిన శ్యామ్ గతంలో దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైనప్పుడు ఆయనతో ఫోటో దిగేందుకు రాగా బౌన్సర్లు తోసేశారు. దీంతో వెంటనే స్పందించిన ఎన్టీఆర్  శ్యామ్ ను పిలిచి ఫోటో దిగారు. ఇప్పుడు శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఎన్టీఆర్ కూడా స్పందించాడు. శ్యామ్ మృతిపై దర్యాప్తు చేయాలని అధికారులను కోరారు.

“శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన, శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

శ్యామ్‌ స్వస్థలం గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం. అక్కడి కాట్రేనికోన మండలంలోని కొప్పిగుంట అయినా కుటుంబం చాలా కాలం నుంచి తిరుపతిలో ఉంటున్నారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసిన శ్యామ్‌ కాకినాడలో జాబ్‌ చూసుకుంటానని కొత్తపేట మండలంలోని మోడేకుర్రులోని తన అమ్మమ్మ ఇంటిలో వారం రోజులుగా ఉంటున్నాడు

24వ తేదీన అతను ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ నెల 25న పోలీసులకు సమాచారం అందింది. మృతుని అమ్మమ్మ మంగాయమ్మ ఫిర్యాదుతో ఏఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి, బంధువులకు అప్పగించారు.

మరోవైపు శ్యామ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హల్‌చల్‌ చేశాయి. దీంతో పోలీసులు మంగళవారం మధ్యాహ్నం మృతుడి సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్యామ్‌ సెల్ఫీ వీడియో తీసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా సెల్ఫీ వీడియోలో మరో వ్యక్తి మాటలు రికార్డు అవడం, ఆ వీడియో కూడా ముక్కలు ముక్కలుగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

ఈ విషయంపై తమకూ అనుమానాలున్నాయని, శ్యామ్‌తో ఎవరైనా చెప్పించారా? సొంతంగా చెప్పాడా? అనేది పోలీసులే తేల్చాలని అతని తండ్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తమ కుమారుడికి ఎవరితోనూ గొడవలు లేవన్నారు. ఉద్యోగం రాలేదని అంటేఇంటికి వచ్చేయాలని చెబితే వచ్చేస్తానన్నాడని థెయ్ల్పారు. తాను మాట్లాడిన తెల్లారేసరికి చనిపోయాడన్న వార్త విన్నామని కన్నీటి పర్యంతమయ్యారు.

పోలీసులు మాత్రం మృతుడు శ్యామ్‌ బ్లేడ్‌తో చేతిమణికట్టు కోసుకుని, చీరతో ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించామని చెబుతున్నారు. అతని జేబులో బ్లేడ్‌, సెల్‌ఫోన్‌ దొరికాయని, వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని కొత్తపేట డిఎస్పీ వెంకట్ తెలిపారు. మరణంపై అనుమానాలు ఉన్నవారు ఫిర్యాదు చేస్తే ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తామన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles