ఎంపీ అవినాశ్ రెడ్డి, సిబిఐలకు సుప్రీం నోటీసులు జారీ

Thursday, December 19, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాశ్‌ రెడ్, సిబిఐ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.  వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు గత నెల 31న మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది.

సునీత త‌ర‌పున సీనియ‌ర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డితో పాటు సీబీఐకి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డివై చంద్ర‌చూడ్ ధ‌ర్మాస‌నం ముందు కేసును విచారించాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొంది.

గత మంగళవారం గత మంగళవారం అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ముందు విచారణకు వచ్చింది. తమ ముందున్న కేసుల్లో సీనియర్‌ న్యాయవాదులు వాదించడానికి ధర్మాసనం అనుమతించకపోవడంతో సునీత రెడ్డి స్వయంగా వాదనలు వినిపించడం విశేషం.

కాకపోతే ఆమెకు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సహకరించడానికి ధర్మాసనం అనుమతించింది.  తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సునీత తెలిపారు. దర్యాప్తును పూర్తి చేయడానికి సీబీఐ కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ కోరుతోందని, ముందస్తు బెయిల్‌ రావడంతో ఆయన్ను సీబీఐ కస్టడీలో విచారణ చేయలేపోతుందని ఆమె పేర్కొన్నారు.

అంతేకాదు తెలంగాణ హైకోర్టు సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

అలాగే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదులతో కేసులు నమోదు చేయించారని పేర్కొంటూ అందుకే ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె కోరారు. జూన్ 31 కల్లా వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తోందని కూడా ఆమె చెప్పారు.

ఇలా ఉండగా, తెలంగాణ హైకోర్టు జోక్యంతో సీబీఐ దర్యాప్తుకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతూ ఉండడంతో జూన్ 31 నాటికి వారి దర్యాప్తు పూర్తి కావడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దానితో దర్యాప్తుకు గడుపు పొడిగించే అవకాశాలున్నాయి.

కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మే 31న షరతులతో నిండిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ ఉత్తరువును సీబీఐ ఇప్పటివరకు సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదు. కానీ, డా. సునీత ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి, న్యాయపోరాటం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles