విశాఖ స్టీల్ పేరుతో కేసీఆర్ ఘరానా మోసం!

Friday, December 5, 2025

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయడానికి యత్నిస్తుంటే,దానిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణా సీఎం కేసీఆర్‌ సింగరేణి కాలరీ్‌సతో బిడ్‌ వేయిస్తున్నారని కేటీఆర్, ఇతర బిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ పక్రియను అడ్డుకోబోతున్న `హీరో’ కేసీఆర్ అన్నట్లు చెప్పుకొంటున్నారు.

అందుకోసం తెలంగాణలోని సింగరేణి కాలరీ్‌సకు చెందిన అధికారుల బృందం మంగళవారం విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి హడావుడి చేసింది. అయితే అసలు వాస్తవం వేరు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. ప్రైవేటీకరణ జరిగినా అందులో బీడ్ వేసే అర్హత తెలంగాణ ప్రభుత్వంకు కాదు, దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏ ప్రభుత్వ రంగ సంస్థకు లేదు.

సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా  బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం తెలంగాణ ప్రజలను చేస్తున్న ఘరానా మోసంగానే చెప్పుకోవాలి.

వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు. కేవలం ముడి పదార్థాలు లేదా మూలధనం సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ప్రకటన మాత్రమే చేసింది. ‘ముడిపదార్థాల సరఫరా లేదా వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చితే… దానికి సమానమైన విలువగల స్టీల్‌ ఇస్తాం! ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రండి’ అని విశాఖ స్టీల్స్‌ ‘ఆసక్తి వ్యక్తీకరణ’ (ఈవోఐ) ప్రకటన జారీ చేసింది. అంతే తప్ప… ఇది స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి కానే కాదు.

ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. ‘ముడిపదార్థాల సరఫరా లేదా వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చితే… దానికి సమానమైన విలువగల స్టీల్‌ ఇస్తాం! ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రండి’ అని విశాఖ స్టీల్స్‌ ‘ఆసక్తి వ్యక్తీకరణ’ (ఈవోఐ) ప్రకటన జారీ చేసింది. అంతే తప్ప ఇది స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి కానే కాదు.

స్టీల్‌ తయారీ సంస్థలతో అనుబంధం, అనుభవం ఉన్నవారెవరైనా బిడ్‌ వేయవచ్చునని స్పష్టం చేశారు. సింగరేణి ఏ విధంగా బీడ్ దాఖలు చేస్తుందో విస్మయం కలిగిస్తుంది. ఒకవేళ ముడిపదార్థాల సరఫరాకు సింగరేణి ఎంపికైతే ఆ సంస్థ సరఫరా చేసే బొగ్గును విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని థర్మల్‌ ప్లాంటులో ఉపయోగించవచ్చు. దీని ద్వారా నెలకు రూ.50 కోట్ల వరకు ఆదా అవుతుంది.

ఇతరత్రా ముడి పదార్థాలు సింగరేణి నేరుగా సరఫరా చేసే పరిస్థితి లేదు. ఈవోఐ నిబంధనల ప్రకారం నేరుగా వర్కింగ్‌ క్యాపిటల్‌ను కూడా అందించే అవకాశముంది. దాదాపుగా రూ.5 వేల కోట్లు అవసరం. సింగరేణి సంస్థ ఆ నిధులను సమకూర్చగలదా? అనేది అసలు ప్రశ్న!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని, బయ్యారం గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్‌ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘తెలంగాణ బొగ్గును ఆంధ్రకు దోిచి పెడతారా. బయ్యారం గనులు ఇచ్చేందుకు ఒప్పుకోం’’ అని తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్‌ ప్రభుత్వం సింగరేణి ద్వారా విశాఖ ఉక్కును కాపాడతామని చెబుతుండటం ఎవ్వరిని మోసం చేయడానికి?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles