పవన్‌తో ఫ్రస్ట్రేషన్: తట్టుకోలేకపోతున్న జగనన్న!

Thursday, December 19, 2024

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నదని తెలుస్తోంది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తన ఓటమి లక్ష్యంగా పనిచేయాలనుకుంటున్న పవన్ కల్యాణ్ విషయంలో.. ఆయన స్పీడు తగ్గించడానికి తన వంతు ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి దారుణంగా భంగపడినట్టు తెలుస్తోంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేలో పవన్ కల్యాణ్ – జనసేన భాగస్వామి అనే సంగతి తెలిసిందే. అయితే.. బిజెపి మనోగతంతో నిమిత్తం లేకుండా.. పవన్ కల్యాణ్ , రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కారు మీద విమర్శలతో విరుచుకుపడడంలో తనదైన శైలితో దూసుకుపోతున్నారు. అయితే ఆయన స్పీడుకు బ్రేకులు వేయాలన్నది జగన్ కోరిక.
ఈ సినేరియోలో అందరికంటె ప్రధాని నరేంద్రమోడీ బలవంతుడు కాబట్టి.. కమలదళం ద్వారా పవన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టుగా ఒక పుకారు వినిపిస్తోంది.
బిజెపిని కూడా చంద్రబాబు జట్టులోకి తీసుకువచ్చి, వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పోరాడుదాం అని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. అయితే ఆయన ఢిల్లీ పర్యటన ఆయన ఆలోచనలకు ప్రతికూలంగా జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపి కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉండే జగన్మోహన్ రెడ్డి.. వారిని బహిరంగ వేదికల మీద కూడా శ్లాఘిస్తుంటారు. బిజెపి నేతల ద్వారా.. జగన్ తెరవెనుక మంత్రాంగం నడిపినట్టుగా ఒక పుకారు ఉంది.
పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశంతో జట్టుకట్టకూడదని, బిజెపి- జనసేన కలిసి పోటీచేస్తే ఖచ్చితంగా అధికారంలోకి రాగలం అని.. ఢిల్లీ పెద్దల ద్వారా సన్నాయి నొక్కులు నొక్కించినట్టుగా పుకార్లున్నాయి. జగన్ స్కెచ్ మేరకు- పవన్ వెళ్లి బిజెపి కూడా కూటమిలోకి రావాలని కోరినప్పుడు.. చంద్రబాబుతో కూటమిలోకి అసలు పవన్ ను కూడా వెళ్లవద్దని బిజెపి నేతలు అన్నట్టుగా ఒక సమాచారం. అయితే దానికి అంగీకరించని పవన్.. జనసేన సంస్థాగతంగా బలపడాల్సి ఉందని, బిజెపి కూడా వారు బలపడే సంగతి వారు చూసుకుంటారని చాలా నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా.. తాను ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చేది గ్యారంటీ అని తెగేసి చెప్పేసారు. తన పాచిక పారకపోయే సరికి జగన్ ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ – చంద్రబాబు కలిస్తే.. తన పార్టీకి జరగగల నష్టం ఊహించుకుంటూ ఆయన ఉడికిపోతున్నారని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles