సీఎం జగన్ కు ఏపీ కొత్త గవర్నర్ నజీర్ మొదటి షాక్!

Sunday, October 6, 2024

మొన్నటి వరకు ఉన్న గవర్నర్ వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎంతో సహాయకారిగా ఉండేవారు. వివాదాస్పదమైన, న్యాయబద్దం కానీ ఫైల్స్ పై కూడా కనీసం వివరణ కూడా కోరకుండానే అత్యవసరంగా సంతకాలు చేస్తుండేవారు. కానీ ఆయనను బదిలీచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సయ్యద్ అబ్దుల్ నజీర్ మాత్రం జగన్ ప్రభుత్వానికి వంత పాట పాడేవారు కాదనే స్పష్టమైన సంకేతం ఇప్పటికే ఇచ్చారు.

రాష్ట్ర శాసనసభలో ప్రసంగం సందర్భంగా ప్రభుత్వం సూచించిన మూడు రాజధానులు వంటి న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలను ప్రస్తావించడానికి తిరస్కరించడం ద్వారా మొదట్లోనే ప్రభుత్వానికి ఒక చురక అంటించారు. తాజాగా, రాజ్‌భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ నివేదికలు పంపాలన్న తాజా ఆదేశం జగన్ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది.

గవర్నర్‌ పేషీ నుంచి సాధారణ పరిపాలన శాఖకు మార్చి 29వ తేదీన పంపిన లేఖలో కీలకమైన పరిపాలనాంశాలపై ఆయా శాఖలు నివేదికలను ప్రతి నెలా మూడో తేదీన తమకు పంపించాలని ఆదేశించారు. జాప్యమైనా ఐదో తేదీ దాటరాదని స్పష్టం చేశారు. కొత్త గవర్నర్‌ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధాల్లో మార్పునకు ఇది సూచిక అని కొందరు, కాదు కాదు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు మాదిరిగా గవర్నర్ క్రియాశీలతను ప్రారంభం అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ లేఖ వెనుక బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఒత్తిడి విధానం ఉన్నట్లు చర్చ జరుగుతోరది. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిజెపితో విడగొట్టుకున్న సమయంలోనూ ఇటువంటి సర్క్యులర్‌ జారీ అయింది. మార్చి 7వ తేదీన ఆనాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 15 పరిపాలానాంశాలపై నెలవారీ నివేదికలివ్వాలని లేఖ రాశారు.

మార్చి ఎనిమిదో తేదీన బిజెపికి చెందిన పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తాజాగా రాష్ట్ర గవర్నర్‌గా వచ్చిన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కేవలర నెల రోజుల్లోనే ఇటువంటి వివరాలు కోరడం గమనార్హం. ఇప్పటికే తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై గవర్నర్ల వ్యవహారం వివాదాస్పదం అవుతుండగా, ఇప్పుడు ఆరధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి సర్క్యులర్‌ జారీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంటుంది.

2018లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండగా అటువంటి సర్క్యులర్‌ జారీ కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు, ఆహార పదార్థాలు, నూనెలు, చక్కెర, వస్త్రాలు, కిరోసిన్‌ వంటి వాటి ధరలు, ప్రభావంపై గవర్నర్  వివరాలు కోరారు. అలాగే వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో సాధించిన అభివృద్ధి, సామాజిక-ఆర్థికాభివృద్ధి అంశాల  వివరాలు కూడా సమర్పించాలని  గవర్నర్‌ పేషీ కోరింది.

ఎస్సీ, ఎస్టీలపై నమోదైన అత్యాచార కేసులు, స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛంద్రప్రదేశ్, నీటిపారుదల రంగంలో పరిస్థితి, వైద్య సేవలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంతోపాటు సామాజిక పింఛన్ల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ, విద్యుత్‌ సరఫరా పరిస్థితి, ఇరధన రంగంలో అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తులు, అందులో కొత్తగా తీసుకువచ్చిన సంస్కరణలు, పేదరికాన్ని నిర్మూలిరచేరదుకు తీసుకురటున్న చర్యలు, పేదలకు ఇళ్ల నిర్మాణ పరిస్థితిపై వివరాలు కూడా ఇవ్వాలని కోరారు.

పిల్లలు, మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, బాలికలకు కల్పిస్తున్న విద్యా సౌకర్యాలు, వికలాంగుల సంక్షేమం, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు, ప్రత్యేకించి యుద్ధంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అందించే సాయంతో పాటు ఇతర పథకాల వివరాలు, ప్రస్తుతం నెలకొన్న ఘటనల వివరాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల వివరాలు కూడా సమర్పించాలని  సర్క్యులర్‌లో కోరారు.

లేఖలో ఇలా కోరడం రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై పట్టు బిగించడానికి, నిఘా పెంచడానికీ అని పలువురు భావిస్తున్నారు. ఈ వివరాలను రాష్ట్రపతికి ప్రతి నెలా పంపించాల్సి ఉంటుందని, అలాగే ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోంశాఖ మరత్రికి కూడా పంపిరచాల్సి ఉరటురదని గవర్నర్‌ పేషీ పేర్కొనడం గమనార్హం. ఒక విధంగా మొత్తం ప్రభుత్వం పనితీరుపై నిఘాపెట్టడంగా స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles