వివేకా హత్య కేసులో సీబీఐకి `సుప్రీం’ నెల రోజుల గడువు!

Sunday, November 17, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం విచారణ చేస్తున్న బృందం మొత్తాన్ని సిబిఐ మార్చేసింది సీబీఐ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్రస్తుతం ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న  రాంసింగ్ ను తప్పించి, ఆయన స్థానంలో సీబీఐ డీఐజీ చౌరాసియాను ఉన్నతాధికారులునియమించారు. 

ఏప్రిల్ 30 లోగా విచారణ ముగించాలని సుప్రీం సిబిఐకి ఆదేశించింది. వివేకా హత్య కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు కొత్త సిట్ ఏర్పాటు చేసింది. డిఐజి కెఇఆర్ చౌరాషియా నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేయడంతో పాటు సభ్యులుగా ఎస్‌పి వికాస్ సింగ్, ఎఎస్‌పి ముఖేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు ఎస్ శ్రీమతి, నవీన్ పునియా, ఎస్‌ఐ అంకిత్ యాదవ్ ఉన్నారు.

ఇక నుంచి వీరి ఆధ్వర్యంలోనే హత్య కేసు విచారణ కొనసాగనుంది. ఏప్రిల్ 30వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించటంతో.. కొత్త టీం వెంటనే బాధ్యతల స్వీకరణ చేయనుంది. నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రతిరోజూ విచారణ చేయాలని నిర్ణయించింది కొత్త విచారణ బృందం.

 ఇప్పటి వరకు కేసు విచారణ అధికారిగా ఉన్న రాంసింగ్ ను మార్చాలంటూ కేసులోని నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు విచారణ బృందాన్ని తప్పించాలని ఆదేశిస్తూ దర్యాప్తు జరుగుతున్న తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది.

మూడేళ్లుగా విచారణ సాగుతున్నా.. ఎలాంటి పురోగతి లేనప్పుడు రాంసింగ్ ఉండి ఉపయోగం ఏంటని అత్యున్నత న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. గత విచారణలో దర్యాప్తు అధికారిని మార్చాలని.. లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక అందజేసింది.

రాంసింగ్‌తో పాటు మరొకరి పేరును సీబీఐ సూచించింది. అయితే రాంసింగ్‌ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్‌ను కొనసాగించడంలో అర్ధం లేదని న్యాయమూర్తి అన్నారు. వివేకా కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తొలగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వేకానంద రెడ్డి హత్య కేసును ఢిల్లీ సిబిఐ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్, దస్తగిరిపై ప్రధాన ఛార్జిషీట్, దేవిరెడ్డి శంకర్ రెడ్డిపై అనుబంధ ఛార్జిషీట్‌ను కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఇదివరకు సిబిఐ దాఖలు చేసింది.

వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అభ్యర్థన మేరకు కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత ఫైల్స్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles