లీకేజి ఆధారాలపై తోకముడిచిన బండి సంజయ్

Wednesday, December 18, 2024

‘గ్రూప్‌ వన్‌ పేపర్‌ లీకేజీపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఏయే గ్రామాల్లో ఎంత మంది మెయిన్స్‌కు అర్హత సాధించారో జాబితా ఉన్నది’ అంటూ మీడియాలో ప్రగల్భాలు పలికిన బిజెపి రాష్త్ర అద్యక్షడు బండి సంజయ్ తీరా ఆధారాలు ఇస్తే తగు చర్యలు తీసుకొంటామని దీనిపై దర్యాప్తు చేసిన సిట్ పిలిస్తే తోకముడిచారు..

ఇటువంటి ఆరోపణలు చేసిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గురువారం పిలవగా, సిట్ ముందు హాజరై అన్ని ఆధారాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే, ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని, దర్యాప్తును తప్పుదోవ పట్టించినందుకు ఆయనపై కేసు నమోదు చేసే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నామని సిట్ అధికారులు తెలిపారు.

ఆ మరుసటి రోజే, శుక్రవారం విచారణకు ఆధారాలతో సహా హాజరు కావాలని కోరుతూ సంజయ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇవ్వకముందు “దమ్ముంటే నాకు నోటీసులు ఇవ్వండి .. ఎవ్వరెవ్వరు దొంగలో బైటపెడతా” అంటూ మీడియాలో బడాయిగా చెప్పుకొంటూ వచ్చారు. ఇప్పుడు తీరా సిట్ నోటీసు జారీచేస్తే తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించినవారిలో బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, సర్పంచ్‌, సింగి ల్‌ విండో చైర్మన్‌ పిల్లలు ఉన్నారని, జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మంది క్వాలి ఫై అయ్యారని, ఒకే గ్రామం నుంచి ఆరుగురు ఉన్నారని 19న బండి ఆరోపించారు. ఒక్కొక్కరి నుంచి రూ.3-5 లక్షలు వసూలు చేశారంటూ ప్రచారం చేశారు.

ఈ మొత్తం లీకేజీ డ్రామా అంతటికి మంత్రి కేటీఆర్‌ బాధ్యుడు అంటూ ఆయనను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత,  మీ వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాలంటూ సిట్‌ అధికారులు ఈ నెల 20న బండికి నోటీసు ఇచ్చారు. దీంతో బండి మాట మార్చి ఆధారాలను ఇచ్చేదే లేదంటూ ప్రకటన ఇచ్చారు.

ఉగాది రోజు మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై ప్రశ్నించగా.. ‘మేం ప్రజల్లో చర్చించుకుంటున్న విషయాలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఎలాంటి ఆధారాలు లేవని, గాలి మాటలను పోగుచేసి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నామని పరోక్షంగా ఒప్పుకున్నట్లు అయింది.

అంతేకాదు సిట్‌ నోటీసులకు స్పందించేది లేదని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపితేనే సహకరిస్తామంటూ చెబుతున్నారు. ఇప్పటికే కోర్టులలో న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో భారీ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. దానితో ఇటువంటి దర్యాప్తులకు సిట్టింగ్ జడ్జీలను కేటాయించే సౌలభ్యం దేశంలో ఎక్కడా లేదు. అయినా అటువంటి డిమాండ్ చేస్తుండటం కేవలం మీడియాలో మైలేజ్ కోసమే అని వెల్లడి అవుతుంది.

పైగా, ఈ లీకేజిపై దర్యాప్తుకు అంటూ 15 మందితో బిజెపి టాస్క్ ఫోర్స్ ను సంజయ్ నియమించారు. దీనిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇద్దరు ఉన్నారు. కేవలం రెండు, మూడు గంటలలో వీరు ఒక నివేదిక తయారుచేసి గవర్నర్ కు సమర్పించారు. కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలనడం తప్పా అందులో ఎటువంటి లోతయిన అంశాలు లేవు.

నిజంగా వీరు దర్యాప్తు చేసి, ఇప్పటివరకు బయటకు రాని విషయాలను కనుగొని ఉంటె పోలీసులకు లేదా ప్రభుత్వంకు ఇచ్చి దర్యాప్తుకు సహకరించాలి. లేదా కనీసం కోర్టుకైనా సమర్పించాలి. అటువంటి ప్రయత్నం ఏమీ చేయకుండా నిత్యం మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ కాలం గడుపుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles