విశాఖ భూదోపిడీకి తొందరపడుతున్న సర్కారు!

Friday, November 15, 2024

విశాఖ పట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలుతుందని జగన్మోహన్ రెడ్డి సర్కారు చెప్పిన తొలినాటినుంచి, అక్కడ భూదందాలు శృతిమించిన సంగతి అందరికీ తెలిసిందే. విశాఖలో భూఅక్రమాలు నెక్ట్స్ లెవెల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ఏపీ కేబినెట్ భేటీ తరువాత.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలను లోతుగా గమనిస్తే, అసలే ఎన్నికలు ఇంకో ఏడాది దూరంలో మాత్రమే ఉండగా.. విశాఖలో భూదోపిడీకి సర్కారు చాలా తొందరపడుతున్నట్లుగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ మంత్రులతో జులై నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించబోతున్నట్టు చెప్పారు. రాజధాని ఈలోగా విశాఖకు తరలిపోతుందని చెప్పారు. ఓ మంత్రి ఎమ్మెల్యేలకు ఇళ్లస్థలాల విషయం ప్రస్తావించే సరికి.. విశాఖలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇద్దాం అని జగన్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, న్యాయమూర్తులకు విశాఖలో ఇళ్సస్థలాలు ఇస్తామని జగన్ చెప్పారట. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన ఇంకో మాట చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. పెట్టుబడిదారులు ఎవరైనా ముందుకు వస్తే వారికి కూడా విశాఖలో నివాసం ఉండడానికి వారికి కూడా స్థలాలు ఇస్తాం అని ఆయన వెల్లడించారు. పెట్టుబడిదారుల ముసుగులో అయినవారందరికీ.. కారు చౌకగా విశాఖలో భూములను దోచిపెట్టడానికి ఇదొక ఎత్తుగడలాగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రూపంలోనే ఒక పెద్ద నాటకం నడిపించారనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. తమ కావాల్సిన తమ సొంత మనుషులతో ముందే ఎన్నడో మాట్లాడుకున్న డీల్స్ నే ఇప్పుడు ఒప్పందాల రూపంలో చేసుకుని బిల్డప్ ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ సమ్మిట్ కు వచ్చిన ఇన్వెస్టర్లు అనే ముసుగులో.. తమ సొంత మనుషులు అందరికీ విశాఖలో భూ సంతర్పణ చేయడానికి జగన్ ఇలాంటి ఎత్తుగడ వేసినట్లుగా కనిపిస్తోంది.
పరిశ్రమలు పెట్టేంత పెట్టుబడిదారులు వారు పెట్టే యూనిట్లకు ప్రభుత్వ ధరలకు స్థలాలను కారుచౌకగా దక్కించుకోవడం ఒక ఎత్తు. కనీసం నివాసస్థలాలను కూడా వారు సొంతంగా కొనుక్కోలేనంత దారిద్ర్యంలో ఉంటారా? అనేది ప్రజల ప్రశ్ర్న. వారికి ఇంటి స్థలాలను కూడా ప్రభుత్వం దోచిపెట్టాలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పెట్టుబడిదార్లకు కూడా ఇంటిస్థలాలు ఇవ్వడం మొదలైతే.. అది ఖచ్చితంగా గ్లోబల్ సమ్మిట్ ముసుగులో అయినవారికి దోచిపెట్టడంగానే తేలుతుంది. అంతగా ఉంటే.. ఆయా పెట్టుబడిదారులు రాష్ట్రంలో ఏ యూనిట్లు స్థాపిస్తున్నారో అవి గ్రౌండింగ్ అయిన తర్వాత, వాటిద్వారా వారు హామీ ఇచ్చినన్ని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఏర్పడిన తర్వాత.. అప్పుడు ఆ యూనిట్లకు సమీపంలోని పట్టణాల్లో వారికి నివాసస్థలాలు కూడా ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని, నిజమైన అధికార వికేంద్రీకరణ అవుతుందని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles