కవితపై బండి సంజయ్ అనుచిత వాఖ్యల పట్ల భగ్గుమన్న బిఆర్ఎస్!

Saturday, January 18, 2025

ఒక వంక ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఢిల్లీలో సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను విచారిస్తూ ఉండడంతో తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కగా, మరోవంక ఆమె గురించి బీజేపీ రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వాఖ్యల పట్ల బిఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు.

‘‘కవితను ఈడీ వాళ్లు ముద్దుపెట్టుకుంటరా.. అరెస్ట్ చేయకుంటే‘’ అని సంజయ్ చేసిన వాఖ్యలపై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటూ ఆందోళనలు చేపట్టాయి. సంజయ్  దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. మద్యం కేసులో దోషిగా ఈడీ ముందు నిలబడిన కవితకు సంఘీభావం తెలిపేందుకు ఒక విధంగా సంజయ్ చేసిన అసభ్య వాఖ్యను ఆయుధంగా దొరికినట్లయింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ నోటీసు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్‌.. ఆ వ్యాఖ్యలపై విచారణ జరపాలని డీజీపికి ఆదేశించింది.
సంజయ్‌పై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 354/A, 504, 509 సెక్షన్ల కింద బంజారహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలు సంజయ్ పై ఎస్ఆర్ నగర్ పీఎస్ లో  కూడా ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళి సై స్పందించాలని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు  బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మ దహనం చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వెంటనే సంజయ్ పై చర్యలు తీసుకోవాలని.. కవితకు క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్  కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

కవితపై బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు హర్షణీయం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్ మండిపడ్డారు.  సంజయ్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ మహిళలతో పాటు, దేశంలో ఉన్న మహిళలందరికీ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

బండి సంజయ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ సంజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల విలువలు తగ్గిపోయాయని తెలిపారు. సంజయ్ రాజకీయ విలువలేని వ్యక్తి అంటూ మహిళలపై గౌరవం లేని వ్యక్తి పార్టీ అధ్యక్షుడు ఉండడం దురదృష్టకరమని విమర్శించారు.

కవితపై చేసిన వ్యాఖ్యలును సంజయ్ ఉపసంహరించుకోవాలని మహబూబాబాద్‌ ఎంపీ కవిత డిమాండ్‌ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని అంటూ సంజయ్‌కి అక్కా చెల్లెలు లేరా అని నిలదీశారు. ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలని ధ్వజమెత్తారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles