ప్రజలకు చేరువయ్యేందుకు `వెబ్‌ రేడియో’కు చంద్రబాబు శ్రీకారం!

Friday, December 5, 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీబాత్‌ తరహాలో తన సందేశాలు, పార్టీ ముఖ్య నేతల ప్రసంగాలను ప్రజలకు రేడియో ద్వారా చేరువ చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకమైన వెబ్‌ రేడియోను డిజైన్‌ చేయాలని నిర్ణయం తీసుకున్న ఆయన దాన్ని సాధ్యమైనంత త్వరలో రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎఫ్‌ఎం రేడియో తరహాలో టీడీపీ వాయిస్‌ రేడియోను తీసుకురావాలని యోచించినా ఆ తర్వాత వివిధ సాంకేతిక కారణాలు, సిగ్నల్‌ లోపాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని పక్కు పెట్టారు. అయితే ఇప్పుడు దాని డిజైనింగ్‌పై దృష్టి సారించారు. పార్టీకి సంబంధించిన నేతలు సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. దీనికోసం కావాల్సిన ఫ్రీక్వెన్సీ అనుమతులు, ఇతర అంశాలను పార్టీ సాంకేతిక విభాగం పరిశీలిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌ వినియోగం భారీగా పెరగడం, ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్లు ఉంటున్న పరిస్థితులను టీడీపీ పార్టీ కార్యక్రమాలన్నీ లైవ్‌లో సెల్‌ఫోన్లలో వీక్షించే దిశగా ఏర్పాట్లు చేసింది. ఇంకోవైపు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ యాప్‌లను విరివిగా వినియోగించుకుంటూ పార్టీ శ్రేణులకు కార్యక్రమాలను చేరువ చేసింది.

అయితే ఇవన్నీ సాధారణ ప్రజానీకానికి పూర్తిస్థాయిలో చేరడం లేదని భావించిన చంద్రబాబు ఇప్పుడు వెబ్ రేడియోకు శ్రీకారం చుట్టారు. వెబ్‌ రేడియోను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఘటన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం ఇదే సమయంలో చంద్రబాబు, నేతల స్పందన, జరుగుతున్న పరిణామాలు ఈ రేడియో కార్యక్రమాల ద్వారా వివరించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది.

ఇదే సమయంలో  రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వివిధ సంఘటనలను ప్రజల మదిలో నిలిచిపోయేలా వాటికి సంబంధించిన వీడియోలను అస్త్రాల రూపంలో సంధించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాలు, మండలాలు, పట్టణాల్లో పార్టీ ఆధ్వర్యంలో ఈ వీడియోల ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles