మళ్లీ మంత్రిపదవిపై ఆశ ఉందా కొడాలీ!

Wednesday, December 25, 2024

తెలుగుదేశం పార్టీని తూలనాడాలంటే, చంద్రబాబు నాయుడును నారా లోకేష్ ను అసహ్యమైన రీతిలో బూతులు తిట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రయోగించే అస్త్రం పేరు కొడాలి నాని. ఒక ప్రజా నాయకుడిగా, సినిమా నిర్మాతగా ఉన్న కీర్తి ప్రతిష్టల కంటే బూతులు మాట్లాడే వ్యక్తిగా కొడాలి నానిని తెలుగు ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీదనే తన రాజకీయ ప్రస్తానానికి శ్రీకారం దిద్దిన కొడాలి నాని.. అనేకమంది జంప్ జిలానిలలో భాగంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచి ముమ్మరంగా జగన్ భజన చేస్తున్నారు.  జగన్ స్తోత్రాలు మాత్రమే కాదు,  చంద్రబాబుపై నిందల విషయంలో కూడా ఆయన ముందంజలో ఉంటారు.

కొడాలి నాని జగన్ క్యాబినెట్ లో మొదటి విడత మంత్రిగా చేసిన తర్వాత పదవిని కోల్పోయారు.  పదవి పోయిన తర్వాత చాలా వరకు సైలెంట్ అయ్యారు.  మునుపటిలా ప్రతిరోజూ మీడియా ముందు చెలరేగిపోవడం తగ్గింది. అయితే కొన్ని రోజులుగా మళ్లీ కొడాలి నాని తన వాచాలత్వాన్ని ప్రతిరోజు ప్రదర్శిస్తున్నారు.  గతంలో లేనంత దూకుడును కొన్ని వారాలుగా  చూపిస్తున్నారు.  చంద్రబాబును, నారా లోకేష్ ను ఏదో ఒక వ్యవహారం లోకి లాగి తన నోటికొచ్చినట్టల్లా తిట్టి  తన బూతుల అభిమానులను సంతోష పెడుతున్నారు.  హఠాత్తుగా ఆయనకు అంతా ఆవేశం ఎందుకు వచ్చింది? అంటే రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి.  వాటిలో ముఖ్యమైనది..  జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేస్తే, మళ్లీ మంత్రి పదవి దక్కుతుందేమోననే పేరాశ!

ఎందుకంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం మొత్తం పూర్తయిన తర్వాత మళ్లీ క్యాబినెట్లో స్వల్ప మార్పులు చేస్తారనే ప్రచారం జరుగుతుంది.   ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి..  క్యాబినెట్లో కులాల సమతూకం చాలా పక్కాగా ఉండేలా జాగ్రత్త తీసుకోబోతున్నారని ప్రచారం ఉంది. ఈ లెక్కన కమ్మ సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం బాగా జరుగుతోంది. . గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచార సభలలోనే బహిరంగంగా హామీ ఇచ్చారు.  ఇప్పటిదాకా ఆ మాట నిలబెట్టుకోలేదు.  మంత్రి పదవి ఇచ్చే ఉద్దేశంతోనే ఆయనను ప్రస్తుతం ఎమ్మెల్యే చేశారని కొందరు  అంచనా వేస్తున్నారు.  అయినా సరే,  కాలం ఖర్మం కలిసొస్తాయేమో..కమ్మ సామాజిక వర్గ మంత్రి పదవి తన దాకా వస్తుందేమో అనే ఆశ కొడాలి నానిని ఊరిస్తున్నట్లుగా ఉంది.  అందుకే ఆయన అవసరానికి మించి రెచ్చిపోయి చంద్రబాబును,  నారా లోకేష్ ను తూలనాడుతూ  ముఖ్యమంత్రి దృష్టిలో పడటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. బూతుల మీద ఆధారపడిన ఆయన కుయుక్తులు ఫలిస్తాయో లేదో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles