కేసీఆర్ కలలకు ఇలా గండిపడుతుందా?

Wednesday, December 18, 2024

దేశమంతా విస్తరించడానికి కర్ణాటక ఎన్నికలతో శ్రీకారం చుట్టాలని భారాస అధ్యక్షుడు కేసీఆర్ కలగంటున్నారు. కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లోనే తమ అస్తిత్వం నిరూపించుకోబోతున్నట్లుగా ఇదివరలోనే స్పష్టం చేశారు. అక్కడ కుమారస్వామి భారాసకు మద్దతు పలు సందర్భాల్లో ప్రకటిస్తున్నారు గానీ.. కన్నడ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా మాత్రమే పోటీచేస్తుందని ఆయన వెల్లడించారు. ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ వ్యవహారం. కుమారస్వామి పార్టీ జనతాదళ్ ఒంటరిగా పోటీచేస్తే.. కేసీఆర్ వారి అభ్యర్థులతో కూడా తలపడతారా? లేదా, వారికి అనుకూలంగా ప్రచారానికి మాత్రం పరిమితం అవుతారా? అనేవే ఇంకా తేలలేదు.
ఇక్కడికే ఇంత కన్ఫ్యూజన్ ఉండగా.. మరోవైపు కేసీఆర్ కలలకు మరో దెబ్బ కూడా పడనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కన్నడ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీని దేశమంతా విస్తరించాలని భావిస్తున్న కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల్లో సూపర్ సక్సెస్ సాదించిన సంగతి తెలిసిందే. అక్కడ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వమే ఏర్పాటు అయింది. గుజరాత్ లో కూడా అలాంటి మ్యాజిక్ సాధ్యమవుతుందని అనుకున్నారు గానీ.. కుదర్లేదు. మోడీ హవా ముందు ఆప్ పనిచేయలేదు. ఇప్పుడు దక్షిణాదికి కూడా విస్తరిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఇప్పటికే ఆప్ నాయకులు వరుస యాత్రలతో అక్కడ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. కేజ్రీవాల్ కూడా కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఖమ్మం సభకు కేజ్రీవాల్ ను కూడా ఆహ్వానించడం ద్వారా.. తామంతా మిత్రపక్షాలం అని చాటిచెప్పడానికి కేసీఆర్ ప్రయత్నించారు. అయితే.. ఇప్పుడు ఆప్ కర్ణాటకలో పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు. ఆప్ తో సీట్ల సర్దుబాటు చేసుకుంటారా? కుమారస్వామితో కూడా సీట్లు పంచుకుంటారా? అలాంటి ప్రతిపాదన వస్తే.. అటు ఆప్, ఇటు భారాస ఇద్దరికీ సీట్లు పంచాలనే ప్రతిపాదన కేసీఆర్ చేస్తేగనుక.. కుమారస్వామి అసలు ఒప్పుకుంటారా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. కన్నడ ఎన్నికల్లో ఆప్, భారాస కలిసి పోటీచేసే అవకాశాలు తక్కువే. అలాంటప్పుడు.. ఆప్ ను మిత్రపక్షంగా చేసుకోవాలనుకోవడం గానీ, కన్నడ ఎన్నికల్లో తన హవా చూపించాలని అనుకోవడం గానీ.. కేసీఆర్ కు అంత సులువు కాకపోవచ్చు. కన్నడ ఎన్నికలే భారాస విస్తరణకు తొలి అడుగుగా కేసీఆర్ చాలా రోజులుగా కలగంటుండగా.. ఇప్పుడు ఆప్ ప్రయత్నాలు తెరమీదకు రావడంతో అంతా డౌటులో పడింది. గెలవడం సంగతి తర్వాత.. కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామితో కొంచెం సీట్ల సర్దుబాటు చేసుకుని అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వాలనేది కేసీఆర్ ప్లాన్. మరి ఆప్ కూడా ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏంటి? ఆప్ కు కొన్ని, భారాసకు కొన్ని సీట్లు కేటాయించి.. మిగిలినవాటిలో కుమారస్వామి జనతాదళ్ పోటీచేసేలా ఒప్పించగలిగితే.. కేసీఆర్ ఘనవిజయం సాధించినట్టే. భారాస ఆధ్వర్యంలో ఒక కూటమి ఏర్పడినట్టు అవుతుంది. కానీ అది అంత ఈజీ కాదు. ఏవో కొన్ని సీట్లు ఇస్తాం అంటే.. ఏకంగా రాష్ట్ర అధికారం మీదనే ఫోకస్ పెడుతున్న ఆప్ అంత ఈజీగా లొంగకపోవచ్చు. మరి కన్నడ ఎన్నికల్లో కేసీఆర్ కలలు ఏ రకంగా ఛిద్రం అవుతాయో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles