ఆవేశంతో మంత్రి కేటీఆర్ రాష్ట్ర శాసనసభలో మిత్రపక్షం ఎంఐఎంపై చేసిన తొందరపాటు వాఖ్యలతో రెచ్చిపోయిన అక్బరుద్దీన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ, చేసిన సవాల్ కార్యరూపం దాల్చితే వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ కు అశనిపాతంగా మారే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ముస్లిం ఓట్లను బధ్రపరచుకోవడం కోసం 2014 ఎన్నికలలో బొటాబొటి ఆధిక్యతతో విజయం సాధించగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చివరికంటా తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంతో సయోధ్యకు కేసీఆర్ చేసిన ప్రయత్నం అందరికి గుర్తుండే ఉంటుంది. స్వయంగా అసదుద్దీన్ ఇంటికి వెళ్లి, తన ప్రభుత్వంలో చేరమని ఆహ్వానించారు. చివరకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వజూపారు.
అయితే, ప్రభుత్వంలో చేరకపోయినా అప్పటినుండి ఎంఐఎం రాష్ట్రంలో కేసీఆర్ కు అండగా ఉంటూవచ్చింది. దేశమంతా డిపాసిట్లు రానిచోట్ల కూడా అభ్యర్థులను నిలబెడుతున్న ఎంఐఎం తెలంగాణాలో మాత్రం పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది నియోజకవర్గాలను దాటి ఎక్కడా పోటీచేయడం లేదు. ముస్లింలు గణనీయంగా ఉన్న నియోజకవర్గాలలో కూడా పోటీచేయడం లేదు.
అందుకు ప్రతిగా, ఎంఐఎం పోటీ చేసే చోట్ల హిందువుల ఓట్లను చీల్చగల అభ్యర్థులను కేసీఆర్ నిలబెడుతూ ఎంఐఎం అభ్యర్థుల ఏకపక్ష గెలుపుకు సహకరిస్తున్నారు. పాతబస్తీలో కేసీఆర్ ప్రభుత్వం కాకుండా ఎంఐఎం ప్రభుత్వం నడిచేటట్లు చేస్తున్నారు. చివరకు కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో సహితం నిబంధనలను కఠినంగా నాటి వైద్య మంత్రి ఈటెల రాజేందర్ అమలుపరుస్తున్నారని ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేస్తే, అప్పటి నుండి ఆ స్ఖవ్యవహారాలను పరోక్షంగా కేటీఆర్ చూస్తూ, పాతబస్తీలో నిబంధనలను సడలించారు.
సీఎం కేసీఆర్, మంత్రులు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వరంటూ అక్బరుద్దీన్ ఓవైసీ సభలో మండిపడ్డారు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినే కలుస్తామంటూ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుకు, జీఎస్టీ వద్దన్నా వెళ్లి మోదీ ప్రభుత్వంకు మద్దతు ఇచ్చారంటూ నిష్ఠూరమాడారు. తమకు మెుదట్నుంచి అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఘాటుగానే కౌంటర్ ఇవ్వడంకోసం గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని.. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి గంటలు గంటలు సమయం ఇవ్వటం సరికాదని స్పీకర్ కు హితవు చెప్పారు. శానససభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేటీఆర్ కు తోలుగా. ఇంతకు ముందు అక్బర్ బాగానే మాట్లాడేవాడని ఇప్పుడు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావటం లేదంటూ విస్మయం వ్యక్తం చేశారు.
తమను చులకనచేసి మాట్లాడేసరికి అక్బరుద్దీన్ ఆగ్రహాదులయ్యారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమకు కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని కేటీఆర్ అన్నారని, ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తాం. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తాం. అంటూ అక్బరుద్దీన్ సవాల్ చేశారు. ఈ ప్రకటనతో అధికార బిఆర్ఎస్ సభ్యులు నివ్వెరపోయారు.
ఎందుకంటె, నిజంగా ఎంఐఎం 50 సీట్లలో పోటీచేస్తే, వారిని గెలుస్తారో అటుంచితే అన్నిసీట్లలో బిఆర్ఎస్ ఓటమి మాత్రం ఖాయం చేసిన్నట్లే కాగలదు. ముస్లింలు ఎంఐఎంకు ఓట్లు వేస్తే ఎక్కువగా నష్టపోయెడిది బిఆర్ఎస్ మాత్రమే అవుతుంది. దానితో బిజెపి అభ్యర్థులు గణనీయంగా గెలుపొందే అవకాశం ఏర్పడుతుంది.
ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఎంఐఎం భారీగా ఎక్కువ నియోజకవర్గాలలో పోటీచేసి, చాలాచోట్ల డిపాజిట్లు జచ్చుకోవడం లేదు. కానీ ప్రతిపక్షాల ఓట్లను చీల్చడం ద్వారా బిజెపి అభ్యర్థులు గెలుపొంది, ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి దోహదపడుతున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.