ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం బయల్దేరి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో బయల్దేరారు. బయల్దేరిన కాసేపటికి విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. వెంటనే విమానాన్ని వెనక్కు తెచ్చి దించేశారు. రాత్రి 9 గంటలకు మరో ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు. ఇదంతా చాలా సహజంగా జరిగిపోయింది. కానీ.. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంపై, ఏదైనా కుట్ర ఉన్నదని సీఎం జగన్ అనుమానిస్తున్నారా? అనేది ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది.
ఎందుకంటే.. ఈ విషయంలో సీఎం జగన్ విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు ప్రజల ఆలోచనలు అటుగా మళ్లుతున్నాయి.
ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానాన్ని అంత నిర్లక్ష్యంగా ఎగరడానికి అనుమతించారా? అనే దిశగా జగన్ సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి విమానాన్ని తనిఖీ చేసినట్టే దీనిని కూడా చేశారని, అయితే విమానంలో ఏదశలో అయినా సమస్య తలెత్తే అవకాశం ఉన్నదని సంబంధిత అధికారి ఎయిర్ పోర్ట్ డైరక్టర్ చెప్పడం విశేషం. జగన్ మాత్రం.. దీనికి సంబంధించి క్షుణ్నంగా విచారణ జరగాలని ఆదేశించడాన్ని గమనిస్తే.. విమానం సాంకేతిక సమస్యలో ఏదైనా కుట్ర కోణం ఉన్నదనే అనుమానం ఆయనకు వచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు.
తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే.. అందులో కుట్రకోణం ఉన్నదనే అనుమానంతో, తనకు నమ్మకస్తులైన సొంత మనుషులతో సుదీర్ఘకాలం ప్రెవేటుగా విచారణ చేయించిన అనుభవం జగన్ కు ఉంది. దేశవ్యాపారసామ్రాజ్యాన్ని శాసించే ఒక పెద్ద గ్రూపు అధినేత ఈ విమాన ప్రమాదం వెనుక ఉన్నారని జగన్ అనుమానిస్తున్నట్టుగా అప్పట్లో పుకార్లు కూడా వినిపించాయి. ఆ తర్వాత.. అదే వ్యాపారదిగ్గజంతో జగన్ చాలా సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పరచుకున్నారు. అయితే తండ్రి హెలికాప్టర్ ప్రమాదం కుట్ర అని భావించిన ఈ ముఖ్యమంత్రి, తన విమానంలో సమస్యను కూడా కుట్రగా అనుమానించడంలో వింత ఏముంటుందని కొందరు అంటున్నారు.
విశాఖలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సన్నాహక సమావేశం కోసం జగన్ ఢిల్లీ బయల్దేరారు. అంతలోనే ఇలాంటి అవాంతరం వచ్చింది.
విమాన వైఫల్యంలో కుట్రం ఉందని జగన్ డౌట్!
Friday, December 5, 2025
