నగరి కొచ్చి మరో కామెడీ షో చేసిన అలీ

Thursday, November 21, 2024

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్లు కుప్పంతో సహా మొత్తం 175 సీట్లలో వైసీపీ విజయం సాధించడం ఏమోగానీ, మొత్తం ఏపీలో పార్టీ ఓడిపోయే మొదటి సీట్ ఏమిటంటే నగిరి అని వైసీపీలో ఎవ్వరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఆ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు ఎవ్వరిని అడిగినా మంత్రిగా ఉన్న రోజా తిరిగి గెలవడం కష్టం అని చెప్పేస్తారు.

స్వయంగా ఎమ్యెల్యేల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఆమె ముందే నగరిలో ఆమె పరిస్థితి ఏమీబాగోలేదని చెప్పేసారు. పరిస్థితి మెరుగుపరచుకోలేక పోతే సీట్ ఇవ్వడం కష్టం అని కూడా తేల్చేశారు. ఎప్పటి నుండో రాజకీయాలలో పదవులకోసం, ఎన్నికలలో సీట్ల కోసం అందరివెంట తిరిగి చివరికు జగన్ ఏదో ఒక అలంకారప్రాయంగా అధికార పదవి కట్టబెట్టగానే హాస్య నటుడిగా పేరొందిన ఆలీ పొంగిపోతున్నారు.

తానేదే ఓ పెద్ద రాజకీయవేత్త అయిన్నట్లు, రాష్ట్రంలో ఎక్కడ సీట్ ఇచ్చినా పోటీచేసి గెలుస్తాను అన్నట్లు తరచూ మాట్లాడుతున్నారు. బహుశా ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించిన తర్వాత  ఆ హోదాలో  మొదటిసారిగా నగిరిలో, రోజా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటూ సీఎం జగన్ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం అంటూ సవాల్ చేశారు.

పైగా ఆయన పాల్గొన్నది రాజకీయ కార్యక్రమం కూడా కాదు. సంక్రాంతి సందర్భంగా నగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంటే ఓ సాంస్కృతిక కార్యక్రమంలో నటుడిగా పిలిచి ఉండవచ్చు. ప్రభుత్వంలో సలహాదారు పదవి ఇచ్చిన తర్వాత కూడా వైసీపీలో సొంత జిల్లాలైన గోదావరి జిల్లాల్లో సహితం ఎవ్వరు, ఏ కార్యక్రమంకు ఆలీని పిలిచినా దాఖలాలు లేవు.

రోజాకు సహితం నగిరిలో బలమైన వైసిపి నాయకులు ఎవ్వరు ఆమె ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ నాయకులు సహితం ఎవ్వరు పాల్గొనడం లేదు. అందుకనే తోటి నటుడు గదా అని తోడుకోసం ఆలీని పిలిస్తే, అక్కడ పవన్ కళ్యాణ్ నే సవాల్ చేసే విధంగా మాట్లాడు మాట్లాడి తాను ఓ గొప్ప కామెడీ నటుడునని నిరూపించుకొన్నారు. నలుగురిలో అల్లరి కూడా అయ్యారు.

175 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం ఖాయమని, వందకు వందశాతం మళ్లీ వైఎస్సార్‌సీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రోజా కూడా మరోసారి ఘన విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు.  కమెడియన్ అలీ కామెడీ చేసి వెళ్లారని అంటూ నగరి టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ ఎద్దేవా చేశారు. సంక్రాంతి రోజున స్థానిక ప్రజలకు బోల్డంత హాస్యం అందించారని అక్కడ జనం ఎగతాళి చేస్తున్నారు.

స్వతహాగా హాస్య నటుడు కావడంతో జనాన్ని నవ్వించడం కోసం ఏమైనా మాట్లాడడానికి సిద్దపడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ పై ఆలీని పోటీకి దింపే తానొక కమెడియన్ గా మారడానికి సీఎం జగన్ సిద్ధపడతారా? సొంత పార్టీ నేతలే ఎవ్వరు ఆలీని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇక రాష్ట్రంలో ఎక్కడి నుండి నిలబెట్టినా అక్కడ ఓటర్లకు వైసిపి ప్రభుత్వం కొంత కామెడీ అందించినా, ఓట్లు మాత్రం పొందడం దుర్లభం కాగలదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles