రేవంత్ – ఉత్తమ్ వర్గాలుగా చీలిపోయిన తెలంగాణ కాంగ్రెస్

Thursday, December 19, 2024

తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి కమిటీల నియామకం రేకేకేతించిన సంక్షోభం మరింతగా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.  రేవంత్ రెడ్డి – ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గాలుగా పార్టీ చీలిపోయిన్నట్లు స్పష్టం అవుతుంది.  ఇప్పటికే తమకు కమిటీలలో తగు ప్రాధాన్యత లేదని కొందరు అసమ్మతి వ్యక్తం చేస్తూ, పదవులకు రాజీనామా  చేయగా, పలువురు సీనియర్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో శనివారం సమావేశమై టిడిపి నుండి వచ్చిన వారికే పదవులు ఇచ్చారంటూ మండిపడ్డారు. 

 తమ మొరను పార్టీ అధిష్ఠానం వినేంత వరకు తాము పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జరిపే కార్యక్రమాలకు హాజరు కాబోమని ప్రకటించిన నేతలు   అన్నట్లు గానే ఆదివారం సాయంత్రం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీకి ముందు చెప్పినట్టుగానే డుమ్మా కొట్టారు. 

దానితో, ఆదివారం రేవంత్ మద్దతు దారులు ఆదివారం ఎదురు దాడి చేపట్టారు. ఇటీవల కొత్త కమిటీలలో పదవులు లభించిన  టిడిపి నుంచి కాంగ్రెస్  లో చేరిన 12 మంది నాయకులు రాజీనామా చేశారు. అందులో సీతక్క, ఎర్ర శేఖర్, వేం నరేందర్, విజయ రామారావు, చారకొండ వెంకటేష్, పటేల్ రమేష్, సత్తు మల్లేష్, విజయ రమణారావు సహా మరికొంతమంది ఉన్నారు. 

రాజీనామా చేస్తూ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కు లేఖ వ్రాస్తూ  తమకు పదవులు వద్దని, పదవులు రాని వారికి ఇవ్వాలని ఆ నేతలు సూచించారు.  మరోవంక, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతల ఆరోపణలకు రేవంత్ రెడ్డి వర్గం కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌లో ఉంటూ ఇతర పార్టీలకు ఎలా సాయం చేస్తున్నారో బయట పెట్టేందుకు కార్యకర్తలకు చెప్పాలని యోచిస్తున్నారు. 

ఉత్తమ్ పై మండిపడ్డ మాజీ ఎమ్యెల్యే 

రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డే 12 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి కారణమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు సేవ్ కాంగ్రెస్ గుర్తుకు రాలేదా? అని సీనియర్ నేతలను ఆయన ప్రశ్నించారు. 

తనకు టికెట్ దావొద్దని ఆనాడు ఉత్తమ్ ప్రయత్నించారని.. కానీ, ఈ విషయంలో భట్టి విక్రమార్కపట్టుబట్టి టికెట్ ఇప్పించారని తెలిపారు.గూడూరు నారాయణ రెడ్డిని రాజీనామా చేయించి బీజేపీలోకి పంపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డినేనని అనిల్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు రూ. 8 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. 

‘వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భట్టి ఉన్నప్పుడు.. ఉత్తమ్ పీసీసీ చీఫ్‌గా ఉండి ఆయన్ని చిన్న చూపు చూడలేదా ? కుల అహంకారం చూపించ లేదా ? బీసీల టికెట్లు కోసే ప్రయత్నం ఉత్తమ్ చేయలేదా ? పొన్నాల టికెట్ కట్ చేసే ప్రయత్నం చేసిండు. కౌశిక్ రెడ్డికి టిఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ వచ్చేలా చేసింది ఉత్తమ్ కాదా? సీఎల్పీగా భట్టిని కాకుండా ట్రై చేయలేదా ? దళితున్ని సీఎల్పీ కాకుండా చేసే ప్రయత్నం చేయలేదా ? ఎల్బీ నగర్ టికెట్ కోసం ఓ వ్యక్తిని రూ. 5 కోట్లు అడగలేదా’ ? అని ఉత్తమ్ లక్ష్యంగా చేసుకుని అనిల్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇలా ఉండగా, తప్పు ఎవరూ చేసినా తప్పేనని పేర్కొంటూ, పిసిసి కమిటీల్లో న్యాయం జరగకపోతే పార్టీ అధిష్టానం ముందు ఈ విషయమై చర్చించాలని  మాజీ ఎంఎల్‌ఎ మల్ రెడ్డి రంగారెడ్డి హితవు చెప్పారు. కానీ కమిటీల విషయమై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే పార్టీకి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. 

కాగా, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విడుదల చేసిన వివిధ కమిటీలలో టిడిపి నుంచి పార్టీలోకి వచ్చిన వ్యక్తుల జాబితాను ప్రకటించారు. పిసిసి కమిటీ ప్రకటించిన 22 మందిలో టిడిపి నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి తప్ప ఎవరూ లేరని స్పష్టం చేశారు. పిఇసి కమిటీలో 40 మంది ఉండగా టిడిపికి చెందిన వారు ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రస్తుత కమిటీలలో సామాజిక న్యాయం జరిగిందన్నారు.

బిజెపిలోకి ఆహ్వానం 

ఇలా ఉండగా, రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేయడం కంటే రాజకీయం వదిలివేయడం మంచిందమని మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, బిజెపి నేత  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు బీజేపీలోకి రండి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles