షర్మిల పాదయాత్రకు బ్రేక్.. తెర వెనుక జగన్!

Thursday, September 19, 2024

వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల రెడ్డి తెలంగాణలో స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున సాగిస్తున్న పాదయాత్రకు బ్రేక్ పడింది. పోలీసులు నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత ఆమె పాదయాత్రలో నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారనే మిష మీద వరంగల్ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో 3500 కిలోమీటర్ల దూరం సాధించిన షర్మిల పాదయాత్ర ప్రస్తుతానికి ఆగిపోయినట్టే. తర్వాత ఎప్పుడు ప్రారంభించేది మళ్లీ ప్రకటిస్తారు. గతంలో పోలీసు అనుమతులు తీసుకున్న షర్మిల నిబంధనలను పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం జరిగిందని ఈసారి అనుమతులు ఎందుకు నిరాకరించకూడదో చెప్పాలని ఆమెకు అనుమతులు నిరాకరించిన వరంగల్ ఎస్పీ షోకాజు నోటీసులో పేర్కొన్నారు.

ఇప్పుడిక తెలంగాణ రాజకీయాలలో అసలు చర్చ షురూ అయింది. షర్మిల యాత్ర ఆగిపోవడం వెనుక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉన్నదా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నా వారు ప్రధానంగా రెండు సహేతుకమైన.

 కారణాలు చూపుతున్నారు

ఒకటి.. మరికొన్ని రోజులు పాదయాత్ర చేస్తే ఇప్పటిదాకా దేశంలో అతిపెద్ద పాదయాత్రగా నమోదు అయ్యి ఉన్న జగన్మోహన్ రెడ్డి రికార్డ్ బద్దలై పోతుంది. ఆయన 2019 ఎన్నికలకు ముందు మహాసంకల్ప యాత్ర పేరుతో సాగించిన సుదీర్ఘమైన పాదయాత్ర 3648 కిలోమీటర్లు పాటు కొనసాగింది. ఇప్పటిదాకా దేశంలో అదే పెద్ద రికార్డు అని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి షర్మిల మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పూర్తి చేశారు. కొన్ని రోజులు చేస్తే చాలు.. అమెరికా 3700 కు చేరుతుంది.

సమయంలో జనవరి నుంచి పాదయాత్ర చేయాలని అనుకున్న నారా లోకేష్ 4000 కిలోమీటర్ల టార్గెట్ పెట్టుకున్నారు. ఒకవేళ ఆయన దానిని పూర్తి చేస్తే దేశంలో అదే పెద్ద పాదయాత్ర రికార్డు అవుతుంది. అంటే జగన్ రికార్డుకు అతీగతీలేకుండా పోతుంది. తన రికార్డు బద్ధలవడం, అది కూడా తన చెల్లెలి చేతిలో జగన్ కు ఇష్టంలేకపోవచ్చు. నిత్యం తెలంగాణ ప్రయోజనాలకు తగినట్టుగా పనిచేస్తుండే జగన్మోహన్ రెడ్డి.. తన ఆబ్లిగేషన్ గా షర్మిల యాత్రకు అనుమతులు రాకుండా చక్రం తిప్పి ఉండొచ్చు. 

రెండో కారణం.. తెలంగాణలో రాజకీయంగా చాలా చురుగ్గా కదులుతున్న షర్మిల పనిలో పనిగా తన విమర్శనాస్త్రాలను జగన్ మీదకు కూడా సంధిస్తోంది. విలేకరులు అడిగిన ప్రశ్నల్లో మీ అన్న బాగా అవినీతి చేసి సంపాదించుకున్నట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు కదా అని అడగగానే.. షర్మిలా రెడ్డి సంపాదించుకోలేదు కదా.. అంటూ ఆమె సెలవివ్వడం విశేషం. ఇండైరక్టుగా.. జగన్ అవినీతిని ఆమె కన్ఫర్మ్ చేస్తున్నారు. తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉండగా జగన్ చేసిన అవినీతి గురించే ప్రధానంగా తెరాస వారు ప్రస్తావిస్తుంటారు. అప్పటి పరిణామాలకు షర్మిల కూడా ప్రధాన సాక్షి. అలాంటిది ఆమె నేను సంపాదించుకోలేదు అనే మాట ద్వారా మా అన్న సంపాదించుకుంటే నన్నెందుకు అడుగుతారు.. అని తేల్చేస్తున్నారు. 

తన అవినీతి గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన చెల్లెలికి ఇప్పుడే బ్రేకులు వేయకపోతే ముందు ముందు తనకే ప్రమాదకరంగా పరిణమిస్తుందనే భయం జగన్ కు కలిగి ఉంటుందని, అందుకే ఆమె పాదయాత్రకు అనుమతులు రాకుండా ఆపు చేయించగలిగారని అనుకుంటున్నారు. ఇప్పుడు వరంగల్ ఎస్పీ నో చెప్పారు. ఆయన చూపించిన ఆధారాలనేచూపించి.. రేపు ఇతర జిల్లాల ఎస్పీలు అనుమతులు నిరాకరించడానికి కూడా అవకాశం ఉంది. అప్పుడిక యాత్ర పూర్తిగా అటకెక్కినట్టే అవుతుంది. 3500 కిమీల మైలురాయి వద్ద ఆగిపోయినట్టే అవుతుంది. జగన్ రెడ్డి రికార్డు భద్రంగా ఉంటుంది. మరి లోకేష్ 4000 కిమీలతో దాన్ని బద్ధలు కొట్టేస్తే ఎలా అనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. దానికి సంబంధించిన స్కెచ్ జగన్ వద్ద వేరే ఉంటుంది. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles