జగన్ సర్కారుకు మరో మొట్టికాయ్!

Monday, May 13, 2024

సరైన ఆలోచన, విచక్షణ లేకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో మనమే మోనార్క్ అని వ్యవహరిస్తే కుదరదు. మన పనితీరును పరిశీలించి మంచి చెడు నిర్ణయించడానికి ఇతర వ్యవస్థలు కూడా ఉంటాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి తన నాలుగేళ్ల పరిపాలనలో దూకుడుగా తీసుకున్న దాదాపు పదుల సంఖ్యలోని అనాలోచిత, దూకుడు నిర్ణయాలు న్యాయవ్యవస్థ ఎదుట తేలిపోతున్నాయి. ప్రతి సందర్భంలోనూ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటున్నారనే మందలింపుతో కోర్టు అక్షింతలు వేసి ఆ నిర్ణయాలను నిలిపివేస్తోంది. తాజాగా 150 డిగ్రీ కళాశాలలకు శరాఘాతంలా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.24ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.

ఏపీలో మొత్తం 1008 డిగ్రీ కాలజీలు ఉన్నాయి. ఇందులో ఫీజులను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అయితే గత ఏడాది 25 శాతం కంటె తక్కువ ఎడ్మిషన్లు అయ్యాయనే కారణంచూపించి.. 150 కాలేజీలకు అసలు ఫీజులను నిర్ణయించలేదు. 25 శాతం కంటె తక్కువ ఎడ్మిషన్లు ఉంటే నాణ్యమైన విద్య, బోధన అందించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో అసలు ఆయా కాలేజీల మూసివేతకు దారితీసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకంటె తక్కువ ఎడ్మిషన్లు ఉండడం వలన కాలేజీలు ఫీజులు వసూలు కాక ముందుకు సాగవు అనేది ప్రభుత్వం ఆలోచన. ఈ జీవో ద్వారా ప్రభుత్వం ఒక వర్గానికి చెందిన వారి కాలేజీలని టార్గెట్ చేసిందనే విమర్శలు కూడా వచ్చాయి.

ఈ జీవో పై ఆ 150 కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. ఈ జీవోకు చట్టబద్ధత లేదని వాదించాయి. దీంతో హైకోర్టు సదరు జీవోను సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు ఆన్ లైన్ కౌన్సెలింగ్ లో ఆ కాలేజీల పేర్లను కూడా జత చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎడ్మిషన్లు తక్కువగా ఉన్నాయి గనుక.. అసలు కాలేజీని మూసివేయాలి అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తమాషాగా ఉంది. ఒక అభ్యర్థికి డిపాజిట్టు రాలేదు గనుక.. అతడు జీవితంలో మళ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికే హక్కులేదంటే ఎలా ఉంటుంది. ఒకప్పట్లో పార్లమెంటులో రెండే ఎంపీ సీట్లతో ఉన్నదని బిజెపిని రద్దుచేసిఉంటే ఇవాళ మోడీ సర్కారే ఏర్పడేది కాదు. ప్జజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయం సబబుగా లేదని అనేక విమర్శలు వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles